P Krishna
UP Fire Accident: ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సీజన్ సిలిండర్లు హఠాత్తుగా పేలడం, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
UP Fire Accident: ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సీజన్ సిలిండర్లు హఠాత్తుగా పేలడం, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
P Krishna
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహరాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్‌లో చిన్న పిల్లల వార్డులో శుక్రవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారే మంటలు వ్యాపించడంతో ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. అస్పత్రి ఎన్ఐసియూ విభాగంలో ఉన్న ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్ షాట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది వాదిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలో ఉన్న మహరాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో 10 మంది శిశువులు సజీవదహనం అయ్యారు. మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తుంది. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనా సమయంలో ఎన్ఐసియూ మొత్తం 54 మంది చిన్నారులు ఉన్నట్లు హాస్పిటల్ సూపరిండెంట్ సచిన్ మహూర్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్ బ్రిగేడ్ తో పాటు, ఆర్మీ ఫైర్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే వార్డులో పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. డీఎం, ఎస్పీ సహా అధికారులు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. మరోవైపు, డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్థరాత్రి ఝాసీకి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన చిన్నారులు, రోగులకు చికిత్స అందిస్తున్నారు. మంటలు, పొగ పీల్చడంతో చాలా మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కళ్లముందే చిన్నారులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నరయ్యారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రమాదం ఎలా జరిగిందీ.. దానికి కారణాలు ఏంటీ అన్న విషయంపై 12 గంటల్లో నివేదిక సమర్పించాలని ఝాన్సీ డివిజనల్ కమీషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఈ వార్త విన్న తర్వాత హృదయం బరువెక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గటన గురించి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. హఠాత్తుగా మంటలు వ్యాపించడంతో భయంతో రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పిల్లల వార్డు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టంగా పొగ అల్లుకుంది. పిల్లల తల్లిదండ్రులు వార్డులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అప్పటికే కొంతమంది చిన్నారులు చనిపోయారు. కళ్ల ముందే చిన్న పిల్లలు కాలిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోయిందని కన్నీరు పెట్టుకున్నారు.