కర్ణాటకలో పానీపూరి ప్రియులకు భారీ షాక్..!బ్యాన్ చేస్తారా?

Panipuri Ban: భారత దేశంలో ఎన్నో రకాల స్ట్రీట్ వుడ్ లభిస్తాయి. ఇందులో చాలా మంది పానీ‌పూరి అంటే ఎంతో ఇష్టపడతారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం పానీ పూరి బండి కనబడితే చాలు ఆగి మరీ తింటారు. అలాంటి పానీపూరిలో కల్తీ జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Panipuri Ban: భారత దేశంలో ఎన్నో రకాల స్ట్రీట్ వుడ్ లభిస్తాయి. ఇందులో చాలా మంది పానీ‌పూరి అంటే ఎంతో ఇష్టపడతారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం పానీ పూరి బండి కనబడితే చాలు ఆగి మరీ తింటారు. అలాంటి పానీపూరిలో కల్తీ జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

భారత దేశంలో పానీ‌పూరి గురించి తెలియని వారు ఉండరు. స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా అమ్ముడుపోయే వాటిలో పానీపూరి, వడాపావ్, షావర్మా, మోమోస్. ఇక పానీ‌పూరి అంటే చిన్నా పెద్దా ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ తింటారు.సాయంత్రం కాగానే స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల నుంచి వెళ్లే వారు రోడ్డు సైడ్ ఉండే పానీ పూరి బండి చూట్టూ గుమికూడుతారు. గోల్ గప్పా, పానీ‌పూరి, గప్ చుప్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తుంటారు. ఇటీవల పానీపూరీ తయారీలో కల్తీ జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పానీ పూరి తిని అస్వస్థతకు గురైన కేసులు వరుసగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుంది.  కర్ణాటకలో ఇటీవల కబాబ్స్, క్యాబేజీ మంచూరియాలో కృతిమ రంగులు, రసాయనాలు వాడటాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిపై పడింది. త్వరలో పానీపూరి నిషేదించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆహార భద్రతా విభాగం వీధుల్లో అమ్ము స్ట్రిట్ ఫుడ్, మాల్స్ లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తో టెస్టింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పానీపూరి నాణ్యతపై పదే పదే ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో దొరికిన పానీపూరిలో ఆరోగ్య ప్రమాణాలు సరిగా లేవని అధికారులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు పానీపూరీ నమూనాలను సేకరించి పరీక్షకు పంపించారు. పానీపూరీని ఎలా తయారు చేస్తున్నారు. ఇందులో ఏ పదార్థాలు వాడుతున్నారు? వీటితో ప్రజల ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే వివరాలు ఆహారశాఖ పరిశీలిస్తుంది. గత రెండు మూడు రోజుల నుంచి పానీపూరి తయారీదారులపై దాడులు నిర్వహిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నివేదిక వచ్చిన తర్వాత పానీపూరి నిషేదించాలా? వద్దా? అనేది నిర్ణయిం తీసుకుంటారని తెలుస్తుంది.

స్ట్రీట్ ఫుడ్‌ను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలలో రుచిని పెంచడానికి యూరియా, హార్పిక్ వంటి ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఇటీవల బెంగుళూరులో 49 స్పాట్ లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పానీపూరీ నమూనాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో పానీపూరీలో వాడే పదార్థాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే కెమికల్స్ ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 243 శాంపిల్స్ లో 41 నమూనాల్లో కృత్రిమ రంగు,క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను గుర్తించారు. దాదాపు 18 శాంపిల్స్ వరకు మానవ వినియోగానికి పనికిరావని ఫుడ్ సెఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం కమీషనర్ శ్రీనివాస్ తెలిపారు. మరికొన్ని పరీక్షా ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయని.. వీటిని స్వీకరించిన తర్వాత నిషేదంపై చర్చించడానికి ఒక సమావేశం ఉంటుందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పానీపూరి తీసుకున్న వారికి అల్సర్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కేవలం కర్ణాటకలోనే కాదు.. ఇటీవల చెన్నైలో కూడా పానీపూరీపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా శాంపిల్స్ తెప్పించుకొని పరీక్షకు పంపించినట్లు సమాచారం.

Show comments