టన్నెల్ ప్రమాదం: కార్మికులు క్షేమంగా రావాలని పూజలు! పిక్ వైరల్!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినప్పటికి దైవాన్ని కొలవడం మాత్రం మరువలేము. ఆఖరికి అంతరిక్ష పరిశోధనలు చేసే సైంటిస్టులు సైతం ప్రయోగానికి ముందు పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడ ఇదే దైవానికి కూలీలను క్షేమంగా తీసుకొచ్చేందుకు విదేశీ ఇంజనీర్ పూజలు చేస్తున్నారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినప్పటికి దైవాన్ని కొలవడం మాత్రం మరువలేము. ఆఖరికి అంతరిక్ష పరిశోధనలు చేసే సైంటిస్టులు సైతం ప్రయోగానికి ముందు పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడ ఇదే దైవానికి కూలీలను క్షేమంగా తీసుకొచ్చేందుకు విదేశీ ఇంజనీర్ పూజలు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలడంతో అందులో పనిచేస్తున్న కూలీలు అక్కడే చిక్కుకు పోయారు. వారిని రక్షించేందుకు శతవిధాల ప్రయత్నాలు ప్రారంభించారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అందుబాటులో ఉన్న రెస్క్యూ టీమ్స్ తో పాటు అంతర్జాతీయ టన్నెల్ నిపుణులను కూడా రప్పించి కూలీల ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ టన్నెల్ నిపుణుడు టన్నెల్ బయట వెలసిన గుడి ముందు మోకరిల్లి కూలీలు క్షేమంగా బయటకు రావాలని మొక్కుతున్న తీరు అందరినీ ఆకర్శించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గత 17 రోజులుగా కూలీలు సొరంగంలోనే చిక్కుకు పోయారు. వారిని సురక్షితంగా బయటికి తీసుకు వచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. సొరంగంలో కూలిన శిథిలాలకు భారీ యంత్రాలతో డ్రిల్‌ చేసుకుంటూ రెస్క్యూ టీమ్స్‌ ముందుకు కదులుతున్నాయి. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్ పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కలిసి రాకపోవడంతో ఇక చేసేదేం లేక దేవుడిపై భారం వేసి మొక్కుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ఆపద సమయంలో ఎంతటి నైపుణ్యం ఉన్నా సరే చివరాకరికి దైవాన్ని నమ్ముకోవడం తప్పదని ఇది చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.

మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా దైవ బలం తోడు కూడా అవసరమే అని ఈ తాజా ఘటన వెల్లడిస్తోంది. ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదానికి లోనైన తరువాత టన్నెల్ బయట ఓ గుడి వెలిసింది. సొరంగంలో చిక్కుకు పోయిన వారు క్షేమంగా బయటకు రావాలని ఉత్తరాఖండ్ సీఎం తో పాటు, విదేశీ ఇంజనీర్ నిపుణుడైన ఆర్నాల్డ్ డిక్స్ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న ఆయన కూడా తన శక్తినంతా ధారపోశారు. తనకున్న నైపుణ్యంతో కూలీలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కూలీల క్షేమాన్ని కాంక్షిస్తూ దేవుడికి పూజలు చేస్తూ అంతిమంగా దైవబలమే గొప్ప అని చాటిచెప్పారు. మరి కూలీలు క్షేమంగా రావాలని పూజలు చేసిన విదేశీ ఇంజనీర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments