Arjun Suravaram
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పటికే అనేక ఘనతలు సాధించింది. తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మానవసహిత అంతరిక్ష ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పటికే అనేక ఘనతలు సాధించింది. తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మానవసహిత అంతరిక్ష ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరనుంది.
Arjun Suravaram
ప్రపంచ చరిత్రలో భారత అంతరిక్ష సంస్థ( ఇస్రో)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలతో భారత్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. చంద్రమండలం, అంగారడుకు, సూర్యుడు వంటి వాటిపై వివిధ ప్రయోగాలు చేసి.. అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది. అయితే ఇస్రోకి ఇప్పటి వరకూ ఒకటి కలగానే మిగిలి పోయింది. ఆ కలను కూడా సాకారం చేసేందుకు భారత్ సిద్ధమైమంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకంగా గగన్ యాన్ అనే తొలి మానవసహిత ప్రయోగానికి భారత్ సిద్ధమైంది. ఈ అంతరిక్ష యాత్ర కోసం నలుగు వ్యోమగాములు ఎంపికయ్యారు. వారి పేర్లను ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.
భారత్ కు చెందిన వ్యోమగామి రాకేశ్ శర్మ గురించి అందరికి సుపరిచితమే. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు ఆయన. అయితే ఆయన అంతరిక్షంలోకి వెళ్లింది మన దేశం నుంచి మాత్రం కాదు. రష్యా చేపట్టిన సోయజ్ టి-11 అనే మానవసహిత రాకెట్ ద్వారా 1984లో ఏప్రిల్ 3 న అంతరిక్షంలోకి వెళ్లారు. అలానే పలువురు భారతీయులు కూడా ఇతర దేశాల నుంచి వెళ్లారు. అయితే భారత్ మాత్రం ఇప్పటి వరకు మానవులను తీసుకెళ్లే అంతరిక్షయాత్రను మాత్రం తలపెట్టలేదు. ఇప్పటి వరకు అగ్రరాజ్యాలకు కూడా సాధ్యంకాని చంద్రడు దక్షిణంలో భారత్ జెండా ఎగిరింది. అయితే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కలగానే ఉండిపోయింది. తాజాగా ఆ కల కూడా సాకరం కానుంది. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. దీని కోసంమే భారత్ గగన్ యాన్ అనే మానవసహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. వారి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఈ అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత గడ్డపై నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న తొలి భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ .. ఈ నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. వారికి ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ అమర్చారు. ఈ వ్యోమగాములు నలుగురు వ్యక్తులు కారని.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్లే నాలుగు శక్తులని కొనియాడారు. 4దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షంలోకి పయనమవుతున్నాడని తెలిపారు. ‘‘ఈసారి కౌంట్‌డౌన్ మనదే.. టైమింగ్ మనదే.. రాకెట్ మనదేనని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇక గగన్ యాన్ అంతరిక్షయాత్ర గురించి చూసినట్లు అయితే.. ఈ యాత్ర 2025 జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. అంతరిక్షంలో దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమగాముల నౌక సముద్రజలాల్లో ల్యాండ్ కానుంది. ఈ యాత్ర విజయవంతమైతే మానవసహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల తరువాత ఆ జాబితలో భారత్ చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా భారత్ చేపట్టిన ఈ గగన్ యాన్ అంతరిక్ష యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Prime Minister Narendra Modi reviews the progress of the Gaganyaan Mission and bestows astronaut wings to the astronaut designates.
The Gaganyaan Mission is India’s first human space flight program for which extensive preparations are underway at various ISRO centres. pic.twitter.com/KQiodF3Jqy
— ANI (@ANI) February 27, 2024