IMD రెయిన్ అలర్ట్: దేశం అంతా వర్షాలు.. ఇంకో 4 రోజులు కుండపోతే!

IMD Alert Rains: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతీ రుతుపవణాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

IMD Alert Rains: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతీ రుతుపవణాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దేశంలో నైరుతీ రుతుపవణాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా గ్రామాలు, పట్టణాల్లో నీటమునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారు. భారీ వర్షాల వల్ల నదులు, జలాశయాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అసోం లో బ్రహ్మపుత్ర నగి ఉగ్రరూపం దాల్చి పొంగి పొర్లుతుంది. మోరిగావ్ జిల్లాలో భారీ వరదల కారణంగా పలు గ్రామాలు నీట మునిగిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా దేశంలోని 23 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..

భారత దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, జలాశయాలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నదులు ప్రమాద అంచులు దాటి ప్రవహిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది.. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 93 మంది చనిపోయినట్లు ASDMA వెల్లడించింది. 21 జిల్లాల్లో 8 లక్షల 40 వేల మంది వరదలతో నిరాశ్రయులయ్యారని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలో 23 రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురువబోతున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళా, కోస్టల్ కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి దీంతో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సిక్కీం, తూర్పు మధ్య ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే తూర్పు రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ మద్యప్రదేశ్, అండమాన్, నికోబార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలోల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా గ్రామాలు వరదల భారిన పడ్డాయి. చమోలి వద్ద నేషనల్ హైవే – 7 పై కొండచరియలు విరిగిపడటంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో బార్డర్ రోడ్డ ఆర్గనైజేషన్ సహాయక చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు కూడా భారీ వర్షం కురిసింది.

 

Show comments