ఫ్రూట్ జ్యూస్‌లో మూత్రం.. తండ్రి, కొడుకులు అరెస్టు చేసిన పోలీసులు..

పొరుగింటి పుల్ల కూర రుచి అంటుంటారు. నిజమే మరీ. .ఇంటే ఎంతో కష్టపడి చేసిన వంటలు నచ్చక..చాలా మంది బయటకు వెళ్లి తింటుంటారు. మీకు కూడా బయట ఫుడ్ బాగా తినే అలవాటు ఉందా..? అయితే ఈ వార్త ఓ సారి చదవండి..

పొరుగింటి పుల్ల కూర రుచి అంటుంటారు. నిజమే మరీ. .ఇంటే ఎంతో కష్టపడి చేసిన వంటలు నచ్చక..చాలా మంది బయటకు వెళ్లి తింటుంటారు. మీకు కూడా బయట ఫుడ్ బాగా తినే అలవాటు ఉందా..? అయితే ఈ వార్త ఓ సారి చదవండి..

ఇంట్లో చేసే వంట కన్నా.. బయట ఫుడ్ చాలా మంది ఇష్టపడుతుంటారు. సుచి, శుభ్రత, రుచి లేకపోయినా.. కలర్ ఫుల్‌గా కనువిందు చేయడంతో టెంప్ట్ అయ్యి. .లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. దీన్నే పొరుగింటి పుల్లకూర రుచి అంటుంటారు. చిన్న చిన్న బండ్ల దగ్గర నుండి ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్లను బతికిస్తుంది మనమే. కానీ ఇప్పుడు బయట ఫుడ్ తినాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. అందుకు ఉదాహరణ ఇటీవల హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలే. హోటళ్లలో సోదాలు చేపట్టగా.. మస్తు కలరింగ్ ఇచ్చిన రెస్టారెంట్లలో సైతం.. డొల్లతనం బయట పడింది. నాసిరకం వస్తువులు, అవుట్ డేటెడ్ పదార్థాలు, పురుగులు పట్టిన పిండి పదార్ధాలు వినియోగిస్తున్నట్లు తేలింది. ఇక వంట గది చూస్తే వాంతులు రావడం ఒకటే తక్కువ.. బయటకు రిచ్ లుక్.. లోపలేమో అధ్వాన పరిస్థితి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లను, వాష్ చేయని గిన్నెలను వినియోగిస్తున్నట్లు తేలింది.

బండ్లు, ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే కాదు.. చివరకు పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీం తినాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి. వరంగల్ నెక్కొండకు చెందిన రాజస్థాన్‌కు చెందిన కాలురాం పుర్బియా అనే ప్రబుద్దుడు ఐస్ క్రీం బండి నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు.. ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు.. ఈ దారుణాన్ని చాటుగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అతడి నిర్వాకం బయటకు వచ్చింది. చివరకు అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలు మర్చిపోక ముందే.. గగుర్పాటుకు గురయ్యే మరో ఘటన వెలుగు చూసింది. ఈ సారి పండ్ల రసాల్లో మూత్రాన్ని పోసి అమ్ముతున్నారు తండ్రీ, కొడుకులు. వినడానికి జుగుప్పాకరంగా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియా బాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తన షాపుకు వచ్చిన కస్టమర్లకు పండ్ల రసాల్లో ఏదో ఎల్లో లిక్విడ్ కలుపుతున్నట్లు కొంత మంది కస్టమర్లు గుర్తించారు.

ఆ లిక్విడ్ ఏంటీ అని షాపు యజమానిని ప్రశ్నించగా..ఏవేవో కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. దీంతో కస్టమర్లకు అది యూరిన్ అన్న అనుమానం వచ్చింది. ఫ్రూట్ జ్యూసుల్లో మూత్రాన్ని కలిపి విక్రయిస్తాన్నడని పలువురు వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన పోలీసులు.. షాప్ వద్దకు వెళ్లి.. జ్యూస్ షాప్ యజమాని అమీర్‍ను అదుపులోకి తీసుకున్నారు. అంకుర్ విహార్ ఏరియా అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ భాస్కర్ వర్మతో కలిసి మరికొంత మంది పోలీసులు కలిసి ఆ షాపులో సోదాలు చేపట్టారు. జ్యూస్ స్టాల్ నుండి మూత్రం నింపిన డబ్బాను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడు జ్యూస్‌లో యూరిన్ కలుపుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఘనకార్యానికి పాల్పడ్డ తండ్రితో పాటు అతడి మైనర్ కుమారుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో.. ఈ సంఘటనలు చూసిన తర్వాత కూడా బయట తినాలనుకుంటే.. ఇక అది మీ ఇష్టం. .. ఏమంటారు.?

Show comments