Arjun Suravaram
Frog Leg In Samosa: ఈ మధ్యకాలంలో హోటల్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. బిర్యానిలో కుళ్లిన మాసం, బొద్దింకలు వంటి జీవులు ప్రత్యక్షమైవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తింటున్న సమోసాలో కప్ప కాలు కనిపించింది. ఈ దారుణ ఘటన ఎక్కడంటే..
Frog Leg In Samosa: ఈ మధ్యకాలంలో హోటల్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. బిర్యానిలో కుళ్లిన మాసం, బొద్దింకలు వంటి జీవులు ప్రత్యక్షమైవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తింటున్న సమోసాలో కప్ప కాలు కనిపించింది. ఈ దారుణ ఘటన ఎక్కడంటే..
Arjun Suravaram
నేటికాలంలో చాలా మంది బయట ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిజీ బిజీ జీవితంలో వండుకునే తీరికలేక, ఇతర కారణాలతో బయటకి వెళ్లి భోజనం చేస్తున్నారు. అలానే వివిధ రకాల స్నాక్స్ కూడా బయటకు వెళ్లి తింటున్నారు. ఇలా హోటల్ లు, రెస్టారెంట్లలకు వెళ్లే భోజన ప్రియులకు షాకింగ్ అనుభవాలు ఎదురవుతున్నాయి. పలు సందర్భాల్లో ఆహార పదార్థాల్లో పురుగులు, కీటకాలు, ఇతర జీవులు ప్రత్యేక్షమవుతున్నాయి. ఆహారంలో వివిధ రకాల జీవులు వచ్చిన ఘటనలకు సంబంధించి వీడియోలు వైరల్ తరచూ అవుతున్నాయి. హోటల్, రెస్టారెంట్లలో ఉండే కిచెన్ లలో శుభ్రత లేకపోవడం వల్ల బొద్దింకలు, ఎలుకలు, పందికొక్కులు, బల్లులు, ఎలుకలు వంటివి ఆహార పదార్థాల్లో పడటం జరుగుతుంది. అంతేకాక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి పడిన ఆహారం కస్టమర్ల వరకు చేరుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి సమోసా తింటుండగా కప్పకాలు ప్రత్యక్షమైంది. మరి..ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
సమోసాలో కప్పకాలు ప్రత్యేక్షమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి సమోసా అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ సమోసాలు తింటుండే వాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆ వ్యక్తి స్థానికంగా ఉన్న బికనీర్ స్వీట్ షాప్‌కు వెళ్లాడు. అక్కడ తనకు ఇష్టమైన సమోసాను కొనుక్కుని తినడం ప్రారంభించాడు. తనకు ఇష్టమైన సమోసా కావడంతో ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నాడు. కొంచెం సమోసా తిన్న తరువాత అందులోఓ వింత ఆకారం కనిపించింది. దీంతో సమోసా తినడం ఆపేసి.. కాసేపు ఆ విచిత్రమైన ఆకారాన్ని పరిశీలించాడు.
సమోసాలో నుంచి దాన్ని బయటకి తీసి చూడగా.. అది కప్పకాలుగా గుర్తించాడు. సమోసాలు కప్పకాలు కనిపించడంతో కొన్ని క్షణాలపాటు ఆ వ్యక్తి షాక్ లో ఉండిపోయాడు. ఆ తరువాత తేరుకుని ఆ స్వీట్ షాప్ సిబ్బందిని ప్రశ్నించాడు. అంతేకాకుండా ఎంతో ఇష్టంగా సమోసా తినేందుకు వస్తే..కప్పకాలు రావడంతో సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అనంతరం సమోసాలో కప్ప కాలు కనిపించిన దృశ్యాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. చివరికి బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఈ సమోసాలో కప్ప కాలు కనిపించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఆ బికనీర్ స్వీట్ షాప్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటల్, రెస్టారెంట్ ఓనర్లకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోయిన తరువాత ఎన్ని చర్యలు తీసుకున్న ఫలితం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సమోసాలో కప్ప కాలు కనిపించిన దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In Ghaziabad, UP, a frog’s leg was found inside a samosa. The case is of Bikaner Sweets. Police took the shopkeeper into custody. The food department sent samples for testing.
ससुरे पूरा मेंढक भी नहीं डाल सकते ?
हद है कंजूसी की 🤦🏻♂️ pic.twitter.com/TmbzndZyUa— amrish morajkar (@mogambokhushua) September 12, 2024