Arjun Suravaram
Fire Accident In INS Brahmaputra: భారతీయ నౌకాదళంకు చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నావి దళ అధికార వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి.
Fire Accident In INS Brahmaputra: భారతీయ నౌకాదళంకు చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నావి దళ అధికార వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి.
Arjun Suravaram
భారత నౌక దళం దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దళంలో అనేక రకాల యుద్ధ నౌకలు ఉన్నాయి. ప్రధానమైన యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ఒకటి. ఇది స్వదేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడింది. ప్రస్తుతం ఇండియన్ నావల్ తన సేవలను అందిస్తుంది. ఇది ఇలా ఉంటే..ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని ముంబైలోని డాక్ యార్డ్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్ర ముంబైయి లోని డాక్ యార్డులో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం యార్డులో ఈ యుద్ధనౌకలో మరమ్మతుల నిర్వహణ చేస్తుండగా మంటలు చేలరేగినట్లు నౌకాదళం వెల్లడించింది. ఈ ఘటనలో ఓ జూనియర్ సెయిలర్ గల్లంతయ్యారని, ఆయన కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టినట్లు తెలిపింది. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు నౌవి అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రీఫిట్ పనులు నిర్వహిస్తుండగా మంటలు చెలరేగినట్లు నేవి వర్గాలు వెల్లడించాయి.
ఈ అగ్ని ప్రమాదంలో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర తీవ్రంగా దెబ్బతింది. ఈ నౌకలో అగ్నిప్రమాదాన్ని గమనించిన నేవీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు నావి సిబ్బంది ప్రారంభించారు. అలా ఆదివారం సాయంత్రం మొదలు పెడితే.. సోమవారం ఉదయంకి అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డాక్‌యార్డులో ఉన్న ఇతర నౌకా సిబ్బంది కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారని చెప్పారు.
ఈ ప్రమాదంలో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ఒక వైపుకు వరిగిపోయింది. అలానే బాగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఇక సముద్రంలోకి ఒకవైపు ఒరిగిపోయిన ఈ నౌకను మళ్లీ యథాస్థానానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నౌకాదళం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నివేదించారు. బ్రహ్మపుత్ర శ్రేణిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి గైగెడ్ మిసైల్ యుద్ధ నౌక ఈ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర. ఇది 2000 సంవత్సం ఏప్రిల్ నెలలో సముద్ర జలాల్లోకి ప్రవేశించింది.
A fire broke out on board Indian Navy warship INS Bramhaputra while undergoing repairs at the naval dockyard in Mumbai.
The fire has been brought under control for now, but the ship has tilted to one side. pic.twitter.com/cRwcpX4KRc
— Wayanad Congress Sevadal (@SevadalWND) July 22, 2024