nagidream
Operation Amanat: రైలులో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చునని మీకు తెలుసా? అది కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, రైల్వే పోలీసుల చుట్టూ, రైల్వే స్టేషన్ చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్ లైన్ లో సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరి అదెలాగో చూసేయండి.
Operation Amanat: రైలులో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చునని మీకు తెలుసా? అది కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, రైల్వే పోలీసుల చుట్టూ, రైల్వే స్టేషన్ చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్ లైన్ లో సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరి అదెలాగో చూసేయండి.
nagidream
రైలు ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ట్రైన్ దిగే క్రమంలో స్మార్ట్ ఫోన్లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు వంటివి మర్చిపోతుంటారు. కొంచెం దూరం వెళ్ళాక గుర్తొస్తుంది. కానీ ఒకసారి మర్చిపోతే ఇక మర్చిపోవడమే. ఎందుకంటే అవి దొరుకుతాయన్న నమ్మకం ఉండదు కాబట్టి. అయితే ఒకవేళ రైల్వే అధికారులకు దొరికితే కనుక ఆ వస్తువులను మీరు తిరిగి పొందవచ్చు. అది కూడా రైల్వే స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే పొందవచ్చు. దీని కోసం మీరు ఆన్ లైన్ పోర్టల్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు. ప్రయాణికులు రైళ్లలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి వారికి చేర్చేందుకు ‘ఆపరేషన్ అమానత్’ అనే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దీన్ని వెస్టర్న్ రైల్వే ప్రారంభించింది. ఈ ఆన్లైన్ పోర్టల్ లోకి వెళ్లి పోగొట్టుకున్న వస్తువుల వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలు నమోదు చేస్తే మీరు రైలులో పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందవచ్చు.
ప్యాసింజర్ ఫిర్యాదుని తీసుకున్నాక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మీ వస్తువుల ఫోటోలను తీసి సంబంధిత బృందాలకు పంపిస్తుంది. వెస్టర్న్ రైల్వే లిమిట్స్ లో పలు జోన్స్ ఉన్నాయి. ముంబై సెంట్రల్ డివిజన్, అహ్మదాబాద్ డివిజన్, వడోదరా డివిజన్, రాజ్ కోట్ డివిజన్, భావ్ నగర్ డివిజన్ వంటివి ఉన్నాయి. ఈ డివిజన్స్ లో రైళ్లలో కనుక మీరు వస్తువులు మిస్ అయితే కనుక తిరిగి పొందవచ్చు. మీరు ఎప్పుడైనా ఇతర రాష్ట్రాలకు,ఇతర నగరాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ డివిజన్స్ లో ప్రయాణం చేసినప్పుడు కనుక పొరపాటున వస్తువులు మర్చిపోతే మీకు ఈ ఆపరేషన్ అమానత్ సేవ ఉపయోగపడుతుంది. రైల్వే అధికారులు రైళ్లలో దొరికిన వస్తువులను ఒకచోట భద్రపరుస్తారు. వాటిని ప్రయాణికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆధారాలు మ్యాచ్ అయితే వారికి తిరిగి ఇస్తారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రైలులో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందాలంటే ఈ కింది స్టెప్స్ ని అనుసరించాలి.