P Venkatesh
ఆధార్ కార్డు ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలకు, బ్యాంకుల్లో లావాదేవీలకు, ఆస్తుల క్రయ విక్రయాలకు ఆధార్ ఎంతో కీలకం. మరి ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా?
ఆధార్ కార్డు ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలకు, బ్యాంకుల్లో లావాదేవీలకు, ఆస్తుల క్రయ విక్రయాలకు ఆధార్ ఎంతో కీలకం. మరి ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా?
P Venkatesh
ఆధార్ కార్డు కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటి. భారతీయ పౌరుల కోసం కేద్ర ప్రభుత్వం 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన ఆధార్ కార్డును జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరంగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందడానికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. అదే విధంగా ఐడెంటిటీ కోసం కూడా ఆధార్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2010లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో మీ పేరు, చిరునామా, డేటాఫ్ బర్త్ మాత్రమే కాకుండా మీ వేలి ముద్రలను కూడా సేకరించి ఆధార్ కార్డును జారీ చేస్తారు. మరి ప్రభుత్వం అందిస్తున్న బ్లూ ఆధార్ కార్డు గురించి మీకు తెలుసా? ఈ ఆధార్ కార్డును ఎవరికీ ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ) బ్లూ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. దీన్నే బాల ఆధార్ గా పేర్కొంటారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బాల ఆధార్ ను ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తుంది. అయితే పిల్లల వయసు ఐదేళ్లు దాటితే ఈ బాల ఆధార్ పనిచేయదు. అప్పుడు ఫింగర్ ప్రింట్స్, వేలిముద్రలు వంటి వివరాలతో ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లూ ఆధార్ ను ఐదేళ్ల లోపు పిల్లల ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి సమాచారంతో పొందొచ్చు. ఈ బ్లూ ఆధార్ కార్డును తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తారు. బ్లూ ఆధార్ కార్డు పిల్లలకు ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్థి పొందడానికి, పాఠశాలల్లో జాయిన్ చేసేటపుడు ఉపయోగపడుతుంది. అయితే ఈ బ్లూ ఆధార్ నమోదు చేసుకోవడానికి సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి కావాల్సిన పత్రాలను, సమాచారాన్ని అందించి పొందొచ్చు.