వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. RC, లైసెన్స్‌ వెంట లేకున్నా నో ప్రాబ్లం.. పూర్తి వివరాలు..

వాహనాదారులకు అదిరిపోయే శుభవార్త. ఇకపై మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ వెహికల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఎలా అంటే..

వాహనాదారులకు అదిరిపోయే శుభవార్త. ఇకపై మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ వెహికల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఎలా అంటే..

నేటి కాలంలో వాహనాలు లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా ఇంటికి ఒక్క వాహనం అయినా ఉంది. ఇక కొందరికి టూ, 4 వీలర్స్‌ ఉన్నాయి. ఇక వాహనాలు ఎన్ని ఉన్నా.. అవి తీసుకుని రోడ్డు మీదకు వెళ్లాలంటే.. కచ్చితంగా మన దగ్గర కొన్ని ప్రతాలుండాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడటమే కాక.. భారీ ఎత్తున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాహనం తీసుకుని రోడ్డు మీదకు వెళ్తున్నామంటే.. కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ, ఇతర పత్రాలు దగ్గర ఉంచుకోవాలి. లేదంటే వేల రూపాయలు ఫైన్‌ రూపంలో చెల్లించాలి. అయితే ఇకపై ఈ సమస్య ఉండదని.. ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వెంట లేకపోయినా ప్రాబ్లం లేదని అంటున్నారు. ఎందుకంటే..

ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయి. గతంలో మాదిరి ఇప్పుడు లేదు. బండి, కారు తీసుకుని రోడ్డెక్కితే.. కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ వంటి పత్రాలు వెంట ఉండాల్సిందే. ఇవి మాత్రమే కాక పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఇన్సురెన్స్‌ ఇలా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉండాల్సిందే. లేదంటే.. మోటార్‌ వాహన చట్టం కింద కఠిన చర్యలు తీసుకువడమే కాక.. భారీ జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ బయటకు వెళ్లేటప్పుడు లైసెన్స్‌, ఇతర పత్రాలు మర్చిపోయి.. ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే.. కచ్చితంగా 5 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సిందే. అందుకే చాలా మంది.. వాహనానికి సంబంధించిన పత్రాలను.. దానిలోనే భద్రపరుస్తారు. అయితే ఇకపై లైసెన్స్‌, ఆర్సీ, ఇన్సురెన్స్‌ వంటి పత్రాలను వెంట తీసుకెళ్లాల్సిన పని లేదు అంటున్నారు.

కేంద్ర ప్రభుతం.. వాహనానికి సంబందించిన అన్ని డాక్యుమెంట్స్‌ని ఒకే చోట పొందేలా.. కొన్ని యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవే డిజిలాకర్‌, ఎంపరివాహన్‌ వంటి మొబైల్‌ యాప్‌లు. మీరు మీ వాహనానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు అనగా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఇన్సురెన్స్‌ వంటి పత్రాలను.. ఈ యాప్‌లలో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. మీరు వీటిని మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రెండు యాపులు దేశవ్యాప్తంగా చెల్లుబాటులో ఉన్నాయి. మీరు కనక ఈ యాప్స్‌లో వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ హార్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేస్తే.. ఎప్పుడైనా వెంట తీసుకెళ్లడం మర్చిపోయినా ఇబ్బంది పడాల్సిన పని లేదు.

కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరం నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్‌, ఎంపరివాహన్‌ యాప్‌లలో అప్‌లోడ్‌ చేసిన పత్రాలను అసలైనవిగా నిర్ధారించింది. దాంతో మీ వాహన డాక్యుమెంట్స్‌ అన్నింటిని.. ఈ యాప్‌లలో అప్లోడ్‌ చేస్తే.. ఇక వాటిని ఎప్పుడు వెంట తీసుకెళ్లాల్సిన పని లేదు అంటున్నారు.

Show comments