మారనున్న పోలీసుల యూనిఫామ్! టీ షర్టులు- కార్గో ప్యాంట్లతో..!

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ చూసిన పోలీసులు అంటే ఖాకీ చొక్కా ధరించిన వారు మాత్రమే కనిపిస్తారు. కానీ, తాజాగా ఇక నుంచి పోలీసులకు ఈ ఖాకీ యూనీఫామ్ అనేది మార్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఖాకీ డ్రెస్ ప్లేసులో టీ షర్టులు, కార్గో ప్యాంట్లతో కొత్త యూనీఫామ్. ఇంతకి ఎక్కడంటే?

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ చూసిన పోలీసులు అంటే ఖాకీ చొక్కా ధరించిన వారు మాత్రమే కనిపిస్తారు. కానీ, తాజాగా ఇక నుంచి పోలీసులకు ఈ ఖాకీ యూనీఫామ్ అనేది మార్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఖాకీ డ్రెస్ ప్లేసులో టీ షర్టులు, కార్గో ప్యాంట్లతో కొత్త యూనీఫామ్. ఇంతకి ఎక్కడంటే?

చాలామందికి పోలీసు ఉద్యోగం చేయాలన్నా, ఆ డిపార్ట్మెంట్ లో చేరాలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే.. పోలీసు ఉద్యోగమే కాదు.. ఒంటి మీద ఉండే ఆ ఖాకీ చొక్కా ఫవర్ కూడా వేరు. అసలు ఇంతకి పోలీసు అన్నా వారు వేసుకునే ఖాకీ చొక్కా అన్నా ఎందుకంత ప్రత్యకత అంటే.. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరగకుండా కాపాడేందుకు ప్రాణాలకు తెగించే గొప్ప సైనికులు కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యూనిఫామ్ ను చూస్తే ప్రజలకు ఒక  ధ్యైరం. మరి, అలాంటి ఖాకీ చొక్కా అనేది బ్రిటీష్ కాలం నుంచి మన దేశంలో పోలీసులు ధరిస్తునే ఉన్నారు.

ముఖ్యంగా పోలీసు అంటే ముందుగా.. ఖాకీ చొక్కా, ఫ్యాంట్ తో అందరికీ గుర్తుకు వస్తారు. ఇక మరి కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీసులు మాత్రం   వైట్ కలర్, బ్లాక్ కలర్ యూనిఫామ్‌లతో కనిపిస్తుంటారు. కానీ, మొత్తంగా చూసుకుంటూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలీసులు అంటే ఖాకీ డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తారు.  అయితే తాజాగా ఇక నుంచి పోలీసులకు ఈ ఖాకీ యూనిఫామ్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకి ఎక్కడంటే..?

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ చూసిన పోలీసులు అంటే ఖాకీ చొక్కా ధరించిన వారు మాత్రమే కనిపిస్తారు. కానీ, తాజాగా ఇక నుంచి పోలీసులకు ఈ ఖాకీ యూనీఫామ్ అనేది మార్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే ఇది  దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసే పోలీసులకు మాత్రమే అని సమాచారం. ఇక ఢిల్లీలో విధులు నిర్వర్తించే  పోలీసులు ఖాకీ యూనీఫామ్ కు బదులు కార్గో ప్యాంట్లు, టీ షర్టుల్లో కన్పించనున్నట్లు నేషనల్ మీడియా కథనాల్లో సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా.. ఢిల్లీ పోలీసుల యూనిఫామ్‌లో మార్పులు చేయనున్నట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెప్పినట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఇకపోతే ఢిల్లీలో నమోదు అవుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పోలీసుల యూనిఫామ్‌లో మార్పులు చేయనున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే.. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ వరకు ఉన్న పోలీసులకు టీ షర్ట్‌లు, ఎక్కువ జేబులు ఉండే కార్గో ప్యాంట్లు అందించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇక చలి కాలంలో దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి  గడ్డకట్టే చలి ఉండటంతో.. వాటిని తట్టుకునేలా ఉలెన్‌ షర్ట్‌లు, ప్యాంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న రంగులో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని అర్థం అవుతోంది. పోలీసులకు అందించే కొత్త యూనిఫామ్‌ కూడా ఖాకీ రంగులోనే ఉంటుందని సమాచారం. టీ షర్ట్‌లు, కార్గో ప్యాంట్లు కూడా ఖాకీ రంగులోనే ఉంటాయని పోలీస్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కార్గో ప్యాంట్లకు ఎక్కువ జేబులు ఉంటాయని, దీని వల్ల పోలీస్ సిబ్బంది డైరీలు, ఫోన్లు, ఆయుధాలు వంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా తీసుకెళ్లొచ్చని అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోలీస్ యూనిఫామ్‌ల మార్పు అనేది ప్రణాళిక దశలోనే ఉందని, త్వరలోనే ట్రయల్‌ కోసం ఇప్పటికే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కానిస్టేబుళ్లకు ఈ కొత్త యూనిఫామ్‌ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయని తాజాగా ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరి, ఢిల్లిలో పోలీసులకు వస్తున్న ఈ కొత్త యూనిఫామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments