వాహనదారులకు అలర్ట్.. ఆ వాహనాలపై నిషేధం.. రోడ్డెక్కితే రూ. 20 వేల ఫైన్

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆ వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. మీరు ఆ వాహనాలను వాడినట్లైతే రూ. 20 వేల జరిమానా కట్టాల్సిందే. ఇంతకీ ఎక్కడంటే?

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆ వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. మీరు ఆ వాహనాలను వాడినట్లైతే రూ. 20 వేల జరిమానా కట్టాల్సిందే. ఇంతకీ ఎక్కడంటే?

నేటి రోజుల్లో వ్యక్తిగత వాహనాల వాడకానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో కాలుష్యం కూడా తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. వాహనదారులకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు, కాలుష్య నివారణకు పలు వాహనాలపై నిషేధం విధిస్తున్నారు అధికారులు. నిషేధించిన వాహనాలను వాడినట్లైతే భారీ జరిమానాలు విధించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం విధించారు. అలాంటి వాహనాలతో రోడ్డెక్కితే ఏకంగా రూ. 20 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.

గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు వ్యాధులతో సతమతమవుతున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడే పొగ, పంట వ్యర్థాలను కాల్చడం, బాణాసంచా కాల్చడం వల్ల ఢిల్లీ మొత్తాన్ని పొగ కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 500 దాటడంతో ప్రమాదకరమైన స్థాయిని మించిందని నిపుణులు పేర్కొంటున్నారు. గాలి నాణ్యత మరింత క్షీణించకుండా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-3, స్టేజ్-4 ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ రాజధాని ప్రాంతంలో బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ ఫోర్‌ వీలర్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ వాహనాలను తీసుకుని రోడ్డెక్కితే జేబుకు చిల్లుపడడం ఖాయం. రూల్స్ పాటించని వారిపై మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 194(1) ప్రకారం రూ.20వేల భారీ ఫైన్ విధించనున్నారు. బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ లైట్ మోటార్ వెహికల్స్ ఇక నుంచి ఢిల్లీలో నడిపేందుకు అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో బీఎస్‌-3 అంతకంటే తక్కువ ప్రమాణాలతో నడిచే డీజిల్‌ గూడ్స్‌ వాహనాలు, అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లైట్ మోటార్ వాణిజ్య వాహనాలు కూడా నిత్యావసర వస్తువులను తీసుకువస్తే తప్ప నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌-4లో భాగంగా ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం, నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలకు కొంత మినహాయింపులు ఇచ్చారు. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, బీఎస్‌-4 డీజిల్‌, ఎలక్ట్రికల్ వాహనాల వంటి సహజ ఇంధనాలతో నడిచే వాణిజ్య వాహనాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ ఫోర్‌ వీలర్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments