Krishna Kowshik
మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా ఖాతాల్లోకి రూ. 2100, విద్యార్థినులకు స్కూటీలు కూడా ఇవ్వనుంది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ కూడా. అయితే ఇక్కడ ఓ కండీషన్ ఉంది. అదేంటంటే...?
మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా ఖాతాల్లోకి రూ. 2100, విద్యార్థినులకు స్కూటీలు కూడా ఇవ్వనుంది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ కూడా. అయితే ఇక్కడ ఓ కండీషన్ ఉంది. అదేంటంటే...?
Krishna Kowshik
గత కొద్ది కాలంగా మహిళా ఓటర్లే లక్ష్యంగా తాయిలాల పర్వానికి తెరలేపుతున్నాయి పార్టీలు. ఏ ఎన్నిక చూసుకున్నా.. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు పథకాలను తీసుకు వస్తున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు పొలిటికల్ లీడర్స్. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు, యువతులను టార్గెట్ చేస్తూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగుతుంది. హర్యానా శాసన సభకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు జరుగుతుండగా.. బీజెపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఈసారి అధిష్టానాన్ని దక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది కాంగ్రెస్. ఈ క్రమంలో ఏడు గ్యారెంటీల పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అలాగే అధికార బీజెపీ.. మళ్లీ తామే అధికారంలోకి రావాలని తహతహలాడుతుంది. ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ తో మ్యానిఫెస్టోను రూపొందించింది.
హర్యానాలో దంగల్ వార్ పీక్స్‌కు చేరింది. మ్యానిఫెస్టోలతోనే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. కాంగ్రెస్ ఏడు గ్యారెంటీలతో ముందుకు రాగా, తాజాగా బీజెపీ 20 హామీలతో తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సంకల్ప్ పత్ర పేరుతో 20 పాయింట్ల వాగ్దానాలను ప్రకటించారు. ఇందులో యూత్, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని హామీలు రూపొందించారు. తాము అధికారంలోకి వస్తే.. లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని మ్యానిఫెస్టోలో పొందు పరిచింది బిజెపీ. హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే అవ్వల్ బాలికా యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటర్ ఇస్తామని తెలిపింది.
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని.. హరియాణాకు చెందిన మాజీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హమీనిచ్చింది బీజెపీ. హర్యానాలో 10 పారిశ్రామిక నగరాల నిర్మాణం చేపట్టడంతో పాటు నగరానికి 50 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద 5 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తామని వాగ్దానం చేసింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తామని, ఓబీసీ వర్గానికి చెందిన వారికి రూ. 25 లక్షల వరకు లోన్లు ఇస్తామని తెలిపింది. గ్రామాలు, పట్టణాల్లో కలిపి మొత్తం పీఎం గృహాలు నిర్మిస్తామని పేర్కొంది. చిరాయు-ఆయుష్మాన్ యోజన కింద, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స, 70 ఏళ్లు పైబడిన వారికి అదనంగా రూ.5 లక్షల వరకు ఉచిత కవరేజ్ అందిస్తామని హామీనిచ్చింది. ఇక రైతులకు 24 రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పొందు పరిచింది. ఈ మ్యానిఫెస్టోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.