Arjun Suravaram
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డును ఫ్రూప్ గా ప్రవేశ పెడుతూ జనన, మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలో నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డును ఫ్రూప్ గా ప్రవేశ పెడుతూ జనన, మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలో నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
Arjun Suravaram
నేటికాలంలో ప్రతి పనికి ఆధార్ అనేది అవసరమవుతుంది. ప్రభుత్వ పథకాల జారీ నుంచి అనేక అంశాల విషయంలో ఆధార్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే వరకు ఈ కార్డు విషయంలో అనేక మార్పులు జరిగియి. దేశంలో నివసించే వారికి ఈ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసింది.అలానే వివిధ పత్రాల జారీ, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించడానికి ఆధార్ కార్డు ఉపయోగ పడుతుంది. అలానే ప్రైవేటు సంస్థలో సైతం పలు సందర్భాల్లో ఆధార్ కార్డును అడుగుతుంటారు. ఇటీవలే ఆధార్ కార్డు పదేళ్లు దాటి ఉంటే అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం చెప్పింది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డును ఫ్రూప్ గా ప్రవేశ పెడుతూ జనన, మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలో నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జనన, మరణాల నమోదు ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునున్నట్లు సమాచారం. గతంలో బర్త్, డెత్ రిజిస్టర్ టైమ్ లో ఆధార్ కార్డు ధృవీకరణ అవసరం ఉండేది కాదు. రిజిస్ట్రేషన్ లో భాగంగా జనన మరియు మరణాల ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రస్తుతం సవరించిన బిల్లులో పార్లమెంట్ ఆమోదం లభించింది.
ఇలా ఈ బిల్లు అమల్లోకి వస్తే..జనన, మరణ రిజిస్టర్లకు పటిష్టమైన, అలానే కచ్చితమైన డేటా నిర్ధారించవచ్చు. అయితే పార్లమెంటు ఆమోదించిన ఈ సవరణ ద్వారా2023 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. కారణం ఏంటంటే.. జనన నిర్ధారణకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డుతో , దాని ద్వారా జనన ధ్రువీకరణ పత్రం జారీ, పాఠశాల అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ , మ్యారెజ్స్ నమోదు ,ప్రభుత్వ ఉద్యోగాల్లో బెనిఫిట్స్ పొందడం వంటి ప్రక్రియలను ఈజీ అవుతాయి. ఇలా పలు ఉపయోగాలు ఉన్నా.. మాత్రం బర్త్ అండే డెత్ ల కోసం నేషనల్ లేదా స్టేట్ లెవలే డేటా బేస్ సేకరణను క్రమబద్ధీకరించడమే పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన లక్ష్యం.
ఇక ఈ బిల్లులో ఏవైనా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చించారు. అలానే ఈ సంప్రదింపుల కారణంగా ఆందోళనలను పరిష్కరించవచ్చని అలాగే ప్రజలు అనేక రకాల ప్రయోజనాలు పొందే విధంగా ఉపయోగపడేలా ఈ చట్టాని తీసుకురావడం జరిగింది. ఆధార్ కార్డు ధృవీకరణతో వివిధ రంగాలు, సేవల్లో ప్రజలు ప్రయోజనం పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ఉద్దేశ్యంతోనే ఇటీవలే ఈ ఆధార్డ్ కు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో ఆమోదించారు. మరి.. జనన, మరణ రిజిస్ట్రర్ విషయంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేయనుండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.