Bharat rice: గుడ్ న్యూస్.. నేటి నుంచి మార్కెట్ లోకి భారత్ రైస్

గుడ్ న్యూస్.. నేటి నుంచి మార్కెట్ లోకి భారత్ రైస్

దేశ ప్రజలకు గుడ్ న్యూస్. భారత్ రైస్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది. భారత్ రైస్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించనున్నారు.

దేశ ప్రజలకు గుడ్ న్యూస్. భారత్ రైస్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది. భారత్ రైస్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించనున్నారు.

భారతదేశం వ్యవసాయధారిత దేశం. రైతులు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్తకు వ్యవసాయం వెన్నుదన్నుగా నిలుస్తోంది. కాగా ఇటీవల సరిగా వానలు కురవక పంట దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వరి విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. ఈ కారణం చేత బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సన్నభియ్యం ధరలు ఏకంగా కిలోకు రూ. 70పలుకుతుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అతి తక్కువ ధరకే బియ్యాన్ని అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రూ. 29 కే కిలో బియ్యం అందించే కార్యక్రమానికి డేట్ ఫిక్స్ చేశారు.

వినియోగదారులకు గుడ్ న్యూస్. కేంద్రం తీసుకొస్తున్న భారత్ రైస్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.29కే కేజీ బియ్యం రానుండడంతో వినియోగదారులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ రైస్ ను 2024 ఫిబ్రవరి 6వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించనున్నారు. మొదటి దశలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్రీయ భాండార్ విక్రయ కేంద్రాల ద్వారా విక్రయించనున్నారు.

ఈ ఏజెన్సీలు 5 కిలోలు,10 కిలోల బియ్యాన్ని ప్యాక్ చేసి విక్రయిస్తాయి. ఇక ఇప్ప‌టికే భార‌త్ ఆటా పేరిట కిలో రూ. 27.50కి గోధుమ పిండిని, భారత్ దాల్ కింద కిలో శ‌న‌గ పప్పును రూ. 60కి అందిస్తోంది. ఈ ఉత్ప‌త్తుల‌ను ఏకంగా 2000 కు పైగా రిటైల్ పాయింట్స్‌ లో విక్ర‌యిస్తున్నారు. భార‌త్ రైస్‌ ను కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తూ ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రం భావిస్తోంది.

Show comments