Keerthi
దశాబ్దా కాలం నుంచి హిందువులు ఎదురుచూస్తున్న కల నేరవేరబోయే సమయం ఆసన్నంమ్యైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ నెల 22న సోమవారం జరగనుంది. అయితే ఈ విషయం పై బీజేపీ నాయకులు రెండు తెలుగు రాష్ట్రలపై మండిపడుతున్నారు. ఎందుకంటే..
దశాబ్దా కాలం నుంచి హిందువులు ఎదురుచూస్తున్న కల నేరవేరబోయే సమయం ఆసన్నంమ్యైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ నెల 22న సోమవారం జరగనుంది. అయితే ఈ విషయం పై బీజేపీ నాయకులు రెండు తెలుగు రాష్ట్రలపై మండిపడుతున్నారు. ఎందుకంటే..
Keerthi
ఎట్టకేలకు అయోధ్యలో ఓ ఆద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. దశాబ్దాల నుంచి హిందువులు ఎదురుచూస్తున్న కల నేరవేరబోయే సమయం ఆసన్నంమ్యైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ నెల 22న సోమవారం జరగనుంది. అయితే.. ఆ రోజును పండుగలా జరుపుకునేందుకు దేశ ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రల ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆధ్వర్యంలో ఉండే పలు కార్యలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. రాముడంటే లెక్కలేదా అని చురకలు పెడుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
భారత దేశమంతాట అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించే చర్చ జరుగుతోంది. అలాగే జనవరి 22న బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుండగా.. ఆ రోజున ఏపీ, తెలంగాణ తెలంగాణ సర్కార్ లు ఎందుకు సెలవు ఇవ్వరని బీజేపీ పార్టీ నిలదీస్తోంది. దేశంలో చాలా రాష్ట్రలు ఎల్లుండి హాలీడే ప్రకటించగా మీకు రాముడంటే లెక్కలేదా అంటోంది. కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల,పోరాటం.. ఈ రామమందిర నిర్మాణం రూపంలో సాకారమవుతోందని, ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాలని రెండు తెలుగు రాష్ట్రలైన వైసీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అయితే ఈ సెలవు స్టూడెంట్స్ కోసం కాదు. రామ భక్తుల కోసమని జనవరి 22న సెలవు ప్రకటించకపోతే సమరమే అంటూ.. ఏపీ, తెలంగాణ సర్కార్‌లపై కమలం పార్టీ సీరియస్ అవుతోంది. కాగా, ఎంతో కన్నుల పండుగగా జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, ఆలాంటి ఆద్భుతమైన రోజున తెలుగు రాష్ట్రల్లో సెలవు ఇవ్వకపోవడం వెనుక దురుద్దేశం ఏమిటని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆరోపించారు.
కాగా, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు.ఇప్పటికే జనవరి 22న ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించగా.. హర్యానా, చత్తీస్ గఢ్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో హాఫ్ హాలీడేగా ఆయా ప్రభుత్వాలు ఆధికరికంగా ప్రకటించాయి. మరి, రెండు తెలుగు రాష్ట్రల్లో సెలవు కోసం బీజేపీ డిమాండ్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.