Keerthi
Anant Ambani: ముంబైలో లాల్‌బాగ్ రాజు వినాయకుడు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. ఇక ఈ వినాయకుడి ఉత్సవాలు చూసేందుకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిఐపీలతో పాటు ప్రజలు కూడా భారీగా తరలివస్తుంటారు. అయితే తాజాగా ఈ వినాయకుడికి అంబానీ కుటుంబం నుంచి కోట్లా విలువైన బంగారం కిరాటం బహుమతిగా అందజేయనున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
Anant Ambani: ముంబైలో లాల్‌బాగ్ రాజు వినాయకుడు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. ఇక ఈ వినాయకుడి ఉత్సవాలు చూసేందుకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిఐపీలతో పాటు ప్రజలు కూడా భారీగా తరలివస్తుంటారు. అయితే తాజాగా ఈ వినాయకుడికి అంబానీ కుటుంబం నుంచి కోట్లా విలువైన బంగారం కిరాటం బహుమతిగా అందజేయనున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
Keerthi
నగరంలో వినాయక చవితి సందడి అప్పుడే మొదలైపోయింది. ప్రతి వీధిలో ఈ గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు భక్తులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా.. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరూ ఈ గణపతి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణేశ్ చుతుర్థి ఉత్సవాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే నగరంలోనే ఈ గణనాథుని మహోత్సవాలు ఇంత కన్నుల పండుగగా ఉంటే.. మరీ ఈ ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ముంబైయిలో ఏ స్థాయిలో నిర్వహిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్నికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయడంతో పాటు,రూ.400 కోట్ల బీమా కూడా చేయించిన విషయం తెలిసిందే. ఇక ఈ విగ్రహాంతో పాటు ముంబైలో లాల్‌బాగ్ రాజు వినాయకుడు కూడా చాలా ప్రత్యేకమైనది. ప్రతిఏటా ఈ లాల్‌బాగ్ రాజు వినాయకుడు అత్యంత ఘనంగా పూజలందుకుంటారు. అయితే ఈసారి ఈ గణేశ ఉత్సవాలకు అంబానీ కుటుంబం భారీ బహుమతిని అందజేయనున్నారు. మరీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబైలో లాల్‌బాగ్ రాజు వినాయకుడు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. ఇక ఈ వినాయకుడి ఉత్సవాలు చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. అంతేకాకుండా.. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిఐపీలు కూడా ఈ వినాయకుడిని దర్శించుకుంటారు. అందులో ముకేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి. పైగా అంబానీ కుటుంబం లాల్ బాగ్ రాజా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కు ట్రస్ట్ గా నియమితులయ్యారు. అలాగే అనంత-రాధిక వివాహం తర్వాత రానున్న మొదటి గణేశోత్సవం కావటంతో.. అంబానీ కుటుంబం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈసారి ముంబాయిలో లాల్‌బాగ్ రాజా వినాయకుడికి అనంత్ అంబానీ తరుపున 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ బంగారు కీరిటం ధర రూ.15 కోట్లు కావడం గమన్హారం. ఇకపోతే ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. మెుత్తానికి అంబానీ ఫ్యామిలీకి ఆ మహా గణపతిపై భక్తిని ఈ విధంగా చాటి చెప్పారు. మరి, అంబానీ కుటుంబం లాల్ బాగ్ రాజా వినాకుడికి అందిస్తున్న బంగారు కిరీటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.