రూ.49 కే 48 కోడిగుడ్లు అనే మెయిల్ చూశారా! అయితే, మీ అకౌంట్లు ఖాళీ

Bengaluru: టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అటు పోలీసులు ఇటు సోషల్ మీడియాలో నిపుణులు ఎంత హెచ్చరిస్తున్న సరే.. కొందరు ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా రూ.49 కే 48 కోడిగుడ్లు అంటూ.. ఓ మోసం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Bengaluru: టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అటు పోలీసులు ఇటు సోషల్ మీడియాలో నిపుణులు ఎంత హెచ్చరిస్తున్న సరే.. కొందరు ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా రూ.49 కే 48 కోడిగుడ్లు అంటూ.. ఓ మోసం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీతో ప్రజలు ఎన్ని ఉపయోగాలు పొందుతున్నారో అందరికి తెలిసిందే. ఇప్పుడు అన్నీ అరచేతిలోకే వచ్చేశాయి. దాదాపు అంతటా ఆన్ లైన్ పేమెంట్స్, ట్రాన్సక్షన్సే జరుగుతున్నాయి. అయితే, ఈ ఆన్లైన్ పేమెంట్స్ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయో కూడా అందరికీ తెలిసిన విషయమే. వినియోగదారులు అప్రమత్తంగా ఉండకపోతే, అదే సైబర్ నేరగాళ్లకు అదునుగా మారి, భారీ మోసాలకు దారి తీస్తుంది. ఇప్పటివరకు సైబర్ మోసాలకు సంబంధించిన ఎన్నో కేసులను చూసి ఉన్నాము. అటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడో ఓ దగ్గర ఈ మోసాలకు గురౌతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళకు 49 రూపాయలకే 48 కోడిగుడ్లు అందిస్తాం అంటూ ఓ మెయిల్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేయడంతో అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బు ఖాళీ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. బెంగుళూరు వసంత్ నగర్ కు చెందిన ఓ మహిళకు, ఫిబ్రవరి 17న ఓ మెయిల్ వచ్చింది. అది కూడా కోళ్ల ఫారం నిర్వహిస్తున్న ఓ ప్రముఖ సంస్థ నుంచి. ఆ మెయిల్ ఓపెన్ చేసి చూడగా ముందుగా దానిలో కోళ్ల పెంపకం, కోడిగుడ్ల డెలివరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత 49 రూపాయలకే నాలుగు డజన్ల గుడ్లు కూడా అక్కడ లభిస్తాయని రాయబడి ఉంది. అంత తక్కువ ధరకు అన్ని కోడిగుడ్లు వస్తున్నాయనే ఆఫర్ ను చూసిన మహిళ, సంతోషం తట్టుకోలేకపోయింది. దీంతో వెంటనే ఆ కోడిగుడ్లను కొనేయాలి అనుకుంది. దాని కోసం అదే మెయిల్ లో ఉన్న షాపింగ్ లింక్ ను క్లిక్ చేసింది.

అక్కడ పేమెంట్ ప్రాసెస్ అంతా ఉంది. దానిలో ఆమె బ్యాంకు వివరాలు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు అన్ని పూర్తి చేసి, 49 రూపాయలను చెల్లించగా పేమెంట్ అవ్వలేదు. దీంతో ఆమె డబ్బులు చెల్లించడానికి క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సి వచ్చింది. వెంటనే క్రెడిట్ కార్డుతో ఆ 49 రూపాయలను చెల్లించేసింది. కానీ ఆమె ఖాతాలో నుంచి 48,199 రూపాయలు మాయమైపోయాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యాక కానీ ఆమెకు అర్థం కాలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. అలాగే ఆమె క్రెడిట్ కార్డును కూడా బ్లాక్ చేయించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలంటూ హెచ్చరించారు. ఏదేమైనా ఆన్ లైన్ లో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ప్రజలంతా తగిన అప్రమత్తంగా ఉండాలి. మరి, 49 రూపాయలకే 48 కోడి గుడ్లు అంటూ మోసం చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments