రే*ప్ కేసుపై తొలిసారి స్పందించిన హర్ష సాయి! సంచలన పోస్ట్!

Youtuber Harsha Sai: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో యూటుబర్ హర్ష సాయి మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు గురించి ఇప్పటికే అందరికి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో మొదటి సారి హర్ష సాయి దీనిపై స్పందించాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Youtuber Harsha Sai: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో యూటుబర్ హర్ష సాయి మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు గురించి ఇప్పటికే అందరికి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో మొదటి సారి హర్ష సాయి దీనిపై స్పందించాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిన్న మొన్నటి వరకు మీడియా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ కేసు.. బర్నింగ్ టాపిక్. ఆ కేసు విషయమే ఇంకా తేలలేదు అనుకుంటే.. ఇంతలో అలాంటిదే మరొక వివాదం తెరపైకి వచ్చింది. అసలు ఇండస్ట్రీ ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి అయిపోయింది. తాజాగా యూటుబర్ హర్ష సాయి మీద ఓ యువతి రే*ప్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యూజర్స్ కు హర్ష సాయి గురించి తెలియనిది కాదు . యూట్యూబ్ లో దాదాపు 14 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అలాగే పేదవాళ్లకు దాన ధర్మాలు చేస్తూ.. బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల బెట్టింగ్ యాప్స్ ను ప్రోమోట్ చేస్తున్నాడంటూ ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు హర్ష సాయి. ఆ విషయం మరువక ముందే ఇప్పుడు ఇంకొకటి మొదలైంది. ఈ క్రమంలో మొదటి సారి హర్ష సాయి.. ఈ వివాదంపై స్పందించాడు. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

పెళ్లి పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసి.. తనని మోసం చేశాడంటూ.. ఓ యువతి హర్ష సాయిపై.. నిన్న రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిని. అంతే కాకుండా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ.. హర్ష సాయితో పాటు.. అతని తండ్రి పై కూడా ఆ యువతి పిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడిపై అత్యాచార కేసును నమోదు చేశారు. అలాగే బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అనేక కోణాల్లో విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హర్ష సాయి పరారీలో ఉన్నట్లు కూడా పలు కథనాలు వినిపించాయి. అయితే ఈ వివాదం మొదలైన తర్వాత మొదటి సారి హర్ష సాయి ఈ విషయంపై స్పందించాడు. “అవన్నీ తప్పుడు ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే అదంతా చేస్తున్నారు. మీకు నా గురించి తెలుసు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది.” అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టాడు హర్ష సాయి.

దీనితో ఇప్పుడు ఈ కేసుపై అందరికి మరిన్నిసందేహాలు మొదలవుతున్నాయి. ఒకవేళ అతనే కనుక తప్పు చేసి ఉంటే ఇంత కాన్ఫిడెంట్ గా అలా పోస్ట్ చేయడు. కానీ పోలీసులు అతనిని విచారించే వరకు కూడా దేనిపైనా ఓ అంచనాకు రాలేము. ఎందుకంటే జానీ మాస్టర్ విషయంలోనూ అదే జరిగింది.. తానూ ఏ తప్పు చేయలేదని చెప్పిన కొద్దీ గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్ లో దానికి వ్యక్తిరేకంగా వచ్చింది. కాబట్టి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో అప్పుడే అంచనా వేయడం కష్టం. అంతే కాకుండా ఆ బాధిత యువతి ఇచ్చిన కంప్లైంట్ లో.. హర్ష సాయి ఆమెపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఈ క్రమంలోనే తన న్యూ*డ్ ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నట్లుగా పేర్కొంది. దీనితో ఈ కేసు పోలీసులకు మరింత క్లిష్టంగా మారింది. మరి ఈ దీనికి సంబంధించి పోలీసులు హర్ష సాయితో ఎలాంటి విచారణ జరపున్నారో.. ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. మరి ఈ విషయంలో హర్ష సాయి స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments