ఊపిరి సినిమా నుంచి జూనియర్ ఎన్టీ ఆర్ ఎందుకు తప్పుకున్నాడు?

ఈ కథను వినమని నాగార్జునని రిక్వెస్ట్ చేసింది జూనియర్ ఎన్టీ ఆర్ అట. బాబాయ్....ఒకసారి ఈ కథ విను, నువ్వూ నేనూ చేద్దాం అని నాగార్జునని ఉత్సాహపరిచింది జూనియరే అని అప్పట్లో చెప్పుకున్నారు.

ఈ కథను వినమని నాగార్జునని రిక్వెస్ట్ చేసింది జూనియర్ ఎన్టీ ఆర్ అట. బాబాయ్....ఒకసారి ఈ కథ విను, నువ్వూ నేనూ చేద్దాం అని నాగార్జునని ఉత్సాహపరిచింది జూనియరే అని అప్పట్లో చెప్పుకున్నారు.

కింగ్ నాగార్జునతో వంశీ పైడిపల్లి రూపొందించిన ఊపిరి సినిమా ఓ ప్రత్యేక తరహా సినిమాగా అందరి కాంప్లిమెంట్స్ సొంతం చేసుకుంది. గందరగోళ భీబత్సమయమైన సినిమాల దాడి నుంచి తప్పించి, ఫోర్సుడు హీరోయిజంకి స్వస్తి చెప్పి, ఎండ్ టు ఎండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఊపిరి. నాగార్జున లాటి హీరో దొరికినప్పుడు ఏ కమర్షియల్ సినిమాతోనే కుమ్మేయకుండా, వంశీ పైడిపల్లి ఇలాటి సినిమా చేశాడేంట్రా బాబూ అని కొందరు కామెంట్ చేసినా, వంశీ పైడిపల్లి తనదైన అబిరుచిని వదులుకోకుండా ఒక సాఫ్ట్ ఫిల్మ్ ని నాగార్జున అభిమానులకు, జనరల్ ఆడియన్స్ కి అందించి తన ప్రత్యేకతను ఊపిరి సినిమాతో చాటి చెప్పుకున్నాడు.
అయితే ఈ కథను వినమని నాగార్జునని రిక్వెస్ట్ చేసింది జూనియర్ ఎన్టీ ఆర్ అట. బాబాయ్….ఒకసారి ఈ కథ విను, నువ్వూ నేనూ చేద్దాం అని నాగార్జునని ఉత్సాహపరిచింది జూనియరే అని అప్పట్లో చెప్పుకున్నారు.

నాగార్జున విన్నారు. ఈ కథ ఏంటంటే ద ఇన్ క్రెడిబుల్స్ అనే ఇంగ్లీషు ఫిల్మ్ బాగా నచ్చి, దాని ఆధారంగా వంశీ పైడిపల్లి వర్క్ చేసుకున్న కథ. కాకపోతే ఫస్టాఫ్ ఇంగ్లీష్ పిల్మ్. సెకండాఫ్ మరో సినిమాని అడాప్ట్ చేశాడు దర్శకుడు వంశీ. అది నాగార్జునకి నచ్చలేదు. సెకండాఫ్ కూడా ఇంగ్లీష్ ఫిల్మ్ లాగే నడిపితేనే కొత్తగా ఉంటుంది, అప్పుడే తనకీ చెయ్యడానికి ఇంట్రస్ట్ కలుగుతుందని వంశీకి నాగార్జున చెప్పారు. అలా చేస్తే తన క్యారెక్టర్ పూర్తిగా పడిపోతుందని జూనియర్ ఎన్టీ ఆర్ చల్లగా ప్రాజెక్టునుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఆ పాత్ర ఎవరు చేస్తారనే చర్చ జరిగినప్పుడు కార్తీ పేరు తెరమీదకి వచ్చింది. అందరూ బాగుంటుందని అనుకుని చివరికి కార్తీనే ఫైనలైజ్ చేసుకున్నారు.

సెకండాఫ్ గనక మార్పు జరగకపోయి ఉంటే కార్తీ చేసిన క్యారెక్టర్ ఇంకా ఎనర్జిటిక్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉండేది అని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. కానీ అందుకు నాగార్జున అంగీకరించలేదు. సినిమా ఫ్రెష్ నెస్ పోతుందని నాగార్జున తన వాదనని వినిపించాడు. నాగార్జునదే ప్రధానమైన పాత్ర. ఆ రెండోది ఏ యంగ్ హీరో చేసినా బావుంటుంది, అది జూనియర్ కి బాగా నచ్చింది. కానీ నాగార్జునదే ప్రధానమైన పాత్ర కాబట్టి, నాగార్జున సూచననే వంశీ పైడిపల్లి ఫాలో కావాల్సి వచ్చింది. ఆ మేరకు జూనియర్ చేద్దామనుకున్న పాత్ర పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఇంక అలా తయారైతే తనకి చేయడానికి ఏమీ ఉండదు, తన ఇమేజ్ కి సరిపోయే పాత్రలా కట్ అవదని జూనియర్ ఊపిరిని వదిలేశాడు.

ప్రపోజల్ స్థాయి నుంచే ఈ సినిమాని తన బ్యానర్ మీద చేద్దామనుకున్న పొట్లూరి వరప్రసాద్ ముందనుకున్నట్టే జూనియర్ ఎన్టీఆర్ చేయనని చెప్పినా, నాగార్జునతో కన్విన్స్ అయి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. జూనియర్ పుణ్యమా అని కార్తీకి తెలుగులో నాగార్జునలాటి బిగ్ హీరోతో వన్ టు వన్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. లాభనష్టాల మాట అటుంచి, ఓ క్లాసిక్ సినిమాగా మాత్రం ఊపిరి నిలబడింది. ధియేటర్లో కిక్కిచ్చే వాతావరణాన్ని ఊపిరి కంటెంట్ అందించలేకపోయినా, హోమ్ వ్యూయింగ్ కి మాత్రం ఎక్సెలెంట్ సినిమాగా మంచి పేరే తెచ్చుకుంది.

Show comments