Xavier: సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడే ఈ మీమ్ స్టార్ ఎవరో తెలుసా?

జేవియర్ పేరుతో మీరు జోకులు, ఫన్నీ మీమ్స్ చూసే ఉంటారు. నవ్వుతూ ఒక ఫోటో, సీరియస్ గా చూస్తున్న ఫోటోతో ఇంటర్నెట్ లో అనేక మీమ్స్, జోక్స్ కనిపిస్తాయి. హిలేరియస్ గా ఉంటాయి అవన్నీ. అయితే ఈ జేవియర్ ఎవరు? అతని ఎక్కడి వాడు? అని ఎప్పుడైనా ఆలోచించారా?

జేవియర్ పేరుతో మీరు జోకులు, ఫన్నీ మీమ్స్ చూసే ఉంటారు. నవ్వుతూ ఒక ఫోటో, సీరియస్ గా చూస్తున్న ఫోటోతో ఇంటర్నెట్ లో అనేక మీమ్స్, జోక్స్ కనిపిస్తాయి. హిలేరియస్ గా ఉంటాయి అవన్నీ. అయితే ఈ జేవియర్ ఎవరు? అతని ఎక్కడి వాడు? అని ఎప్పుడైనా ఆలోచించారా?

జేవియర్.. జేవియర్ అంకుల్ పేరుతో ఎక్కువగా అనేక ఫన్నీ మీమ్స్ వస్తుంటాయి. ఆ మీమ్స్ లో ఈ వ్యక్తి నవ్వుతూ, కొంచెం సీరియస్ ముఖంతో కనిపిస్తాడు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు వాడే వారికి ఇతని మీమ్స్ గురించి బాగా తెలుస్తుంది. జేవియర్ అనే పేరుతో మీమ్స్ బాగా వైరల్ అవుతుంటాయి. అచ్చం భారతీయుడిలా మీసాలున్న ఈ వ్యక్తి ఫేస్ బుక్, ట్విట్టర్, రెడ్డిట్ వంటి మాధ్యమాల్లో దర్శనమిస్తాడు. మీమ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 9గ్యాగ్ అనే మీమ్స్ వెబ్ సైట్ లో కూడా ఈయన కనబడతాడు. ఇతని ఫోటో మీద అనేక మీమ్స్ వచ్చాయి. వస్తున్నాయి. ఇప్పటికీ అవి వైరల్ అవుతున్నాయి. ఇతను ఇంతలా ఫేమస్ అవ్వడానికి కారణం ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమర్. అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించే ఈ మీమ్ స్టార్ గురించి చాలా మందికి తెలియదు. అతని అసలు పేరు ఏంటో? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో అనేది తెలియదు.  

నిజానికి అతని పేరు జేవియర్ కాదు. అతని అసలు పేరు ఓం ప్రకాష్ అట. ఈయన 1968లో అక్టోబర్ 22న జన్మించాడని తెలుస్తోంది. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి. ఐఐటీ కాన్పూర్ లో స్టాఫ్ మెంబర్ అని సమాచారం. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జేవియర్ మీమ్స్ ఇంతలా పాపులర్ అవ్వడం వెనుక ఉన్నది పకాలు పపీటో అనే పేరు. పకాలు పపీటో పేరుతో ఫిక్షనల్ క్లర్క్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది ఈ ఓం ప్రకాష్ నే. ఆయన క్రియేట్ చేసిన కామిక్ మీమ్స్ తో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలోవర్స్, ట్విట్టర్ లో 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. పపీటో అమెరికాలో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్టు పెట్టాడు. కానీ నిజానికి అతనొక భారతీయ వ్యక్తి. నో యువర్ మీమ్స్ అనే వెబ్ సైట్ ప్రకారం.. పకాలు పపీటో 2013లో జూలై 12న ట్విట్టర్ ఖాతా తెరిచాడు. ఆ సమయంలో అతను ‘హలో ట్విట్టర్ ఐ యామ్ సింగిల్’ అని తొలి ట్వీట్ చేశాడు.

రెండేళ్లలో ఈ ట్వీట్ ని 17 వేల మంది రీట్వీట్ చేశారు. 6 వేల మంది లైక్ చేశారు. 7,39,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఈయన చేసే ట్వీట్స్.. ట్విట్టర్ రూల్స్ కి విరుద్ధంగా ఉందన్న కారణంతో 2018లో ఇతని ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. 2013 సెప్టెంబర్ 2న ఫేస్ బుక్ పేజ్ ఒకటి తెరిచాడు. అయితే ఈ పేజ్ కూడా డిలీట్ అయిపోయింది. దీని తర్వాత @pakalupapitow పేరుతో ఒక కాపీ క్యాట్ అకౌంట్ ఒకటి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ అకౌంట్ ద్వారా అచ్చం పకాలు పపీటో స్ట్రాటజీని అనుసరించి ఫన్నీ మీమ్స్ పోస్ట్ అయ్యేవి. అయితే ఇది పకాలు పపీటో ఖాతానా? కాదా? అనేది ఇప్పటికీ అనుమానమే. ఆ తర్వాత ఈ పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత జేవియర్, జేవియర్ అంకుల్ ఇలా కొన్ని ఖాతాలు పుట్టుకొచ్చాయి.

పపీటో స్ట్రాటజీని అనుసరించి జేవియర్ మీమ్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా ఈ జేవియర్ పేరుతో మీమ్స్ కనిపిస్తాయి. అవి చదివితే చాలా నవ్వు తెప్పిస్తాయి. జేవియర్ మీమ్స్ లో ఒక జోక్ గురించి మాట్లాడుకోవాలి. 80 శాతం అబ్బాయిలు సిగరెట్ తాగే అమ్మాయిలని ఇష్టపడతారట. దానికి జేవియర్ ఇచ్చిన సమాధానం వింటే ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందో అర్థమవుతుంది. ‘సిగరెట్ తాగే అమ్మాయిలు త్వరగా చనిపోతారు. ఆమె చనిపోయాక వేరే అమ్మాయిని చూసుకోవచ్చు. అందుకే అబ్బాయిలు సిగరెట్ తాగే అమ్మాయిలని లవ్ చేస్తారు’ అని సమాధానం ఉంటుంది. ఇలా ఉంటాయి జేవియర్ జోక్స్. ఇదీ జేవియర్ మీమ్స్, జోక్స్ వెనుక ఉన్న కథ.

Show comments