Keerthi
ఇటీవలే జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఈ నివేదికపై మాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు పలవురు స్టార్ సెలబ్రిటీస్ స్పందిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ హేమ కమిటీ అంటే ఏమిటి? దీనిపై ఎందుకు ఇంత స్పందన వచ్చింది? ఎందుకు ఈ హేమ కమిటీ గురించి అన్ని చర్చలు జరుగుతున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఈ నివేదికపై మాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు పలవురు స్టార్ సెలబ్రిటీస్ స్పందిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ హేమ కమిటీ అంటే ఏమిటి? దీనిపై ఎందుకు ఇంత స్పందన వచ్చింది? ఎందుకు ఈ హేమ కమిటీ గురించి అన్ని చర్చలు జరుగుతున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీలో ఈ పదం వినడం కొత్తేమీ కాదు. ఎందుకంటే..నాటి నుంచి నేటి వరకు ఇండస్ట్రీలో ఈ సమస్యను ఎంతోమంది సినీ తారలు ఎదుర్కొంటునే ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు చాలామంది ఈ వేధింపుల్లో బలైపోయారు. కానీ, రాను రాను ఈ సమస్యను నిర్భయంగా బయటకు చెప్పుకున్న రోజులు వచ్చాయి. ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు తాము ఎదుర్కొన్న బాధలను పబ్లిక్ గా చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ సమస్యలపై ఇటీవలే జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఈ నివేదికపై మాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు పలవురు స్టార్ సెలబ్రిటీస్ స్పందిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ హేమ కమిటీ అంటే ఏమిటి? దీనిపై ఎందుకు ఇంత స్పందన వచ్చింది? ఎందుకు ఈ హేమ కమిటీ గురించి అన్ని చర్చలు జరుగుతున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ ఈ హేమ కమిటీ అంటే ఏమిటి?
మాలీవుడ్ ఇండస్ట్రీలో అక్టోబర్ 2017లో నటి భావనపై లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును అనుసరించి మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్స్, ఎడ్జస్ట్ మెంట్స్ వంటి లైంగిక వేధింపులను ఆరోపణలను పరిశోధించడానికి రిపోర్టు ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. అయితే ఈ రిపోర్ట్ కు పరిశోధించడానికి హైకోర్టు న్యాయమూర్తి కె. హేమ, నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. 2019 లో ఈ కమిటీ రంగంలోకి దిగింది. ఇలా లైంగిక వేధిందపులకు గురైన ఇండస్ట్రీకి చెందిన మహిళ ఫిర్యాదులను పరిశీలించి,వాటిపై చర్యలను సిఫార్సు చేయడం ఈ కమిటీని ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి ?
మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారు ? ఇండస్ట్రీలో ఎలాంటీ కీచకులు ఉన్నారు అనేదాని మీద పరిశోధన చేసి ఓ నివేదికను తయారు చేశారు జస్టిస్ హేమ కమిటీ. ఇక ఆ నివేదికను కేరళ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలు చూసి ప్రభుత్వం షాకైంది. ఎందుకంటే.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో డైరెక్టర్, నిర్మాత, హీరో, నటుడు .. చివరికి అసిస్టెంట్స్ సైతం మహిళలను లైంగికంగా ఎలా వేధిస్తున్నారో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. ఇక ఈ నివేదికపై కేరళ ప్రభుత్వం చాలా తీవ్రంగా మండిపడింది.
ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులకు గాను, మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనను వెల్లడించిన జస్టిస్ కె హేమ కమిటీ అందించిన నివేదిక ప్రకారం ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత.. మలయాళ ఇండస్ట్రీలో వేధింపులకు గురైన మహిళ నటులు ఒక్కొకరుగా బయటకు వచ్చి, తాము ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ధైర్యంగా బయటపెడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వేధింపులకు గురిచేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో స్టార్ నటులు ఉండటం గమన్హారం. దీంతో మలయాళ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఖంగుతింది.
ఎందుకంటే.. పైకి పద్ధతిగా, అమాయకంగా కనిపించే స్టార్స్ వెనుక ఇంతటి చీకటి కోణం ఉందా అని ప్రేక్షకులు, నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే.. ఛాన్స్ ల కోసం వచ్చిన అమ్మాయిలను లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని స్టార్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక హేమ కమిటీ నివేదిక తర్వాత.. లయాళ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) పదవికి నుంచి దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వెంటనే సిద్ధిఖీ తో పాటు పలువురు పదవులకు రాజీనామా చేశారు. తాజాగా మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ సైతం అమ్మ అసోసియేషన్ కు రాజినామా చేశారు. అలాగే తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరారు.
హేమ కమిటీ పై సెలబ్రిటీస్ స్పందన
ఇక మలయాళ ఇండస్ట్రీలో మహిళ నటులు ఎదుర్కొన్న సమస్యలపై హేమ కమిటీ ఇచ్చిన నివేదిక పై పలువురు స‍్టార్ సెలబ్రిటీస్ ప్రశంసిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో ఉండే నటీమణులే కాదు.. పొరుగు రాష్ట్ర నటులు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే స్టార్ నటి సమంత సీనియర్ నటి ఊర్వశి, ఖుష్బూ సైతం ఈ విషయం స్పందించి హేమ కమిటీ ఇచ్చిన తీర్పు పై ప్రశంసలు కురుపిస్తున్నారు.