ఐశ్వర్య, అభిషేక్ గ్రే డివోర్స్ అంటూ వార్తలు.. అసలెందుకు ట్రెండ్ అవుతోంది?

What Is Grey Divorce: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రే డివోర్స్ అన్న పదం బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ గ్రే డివోర్స్ అంటే ఏంటి? దీనికి, ఐష్, అభిషేక్ లకి సంబంధం ఏంటి?

What Is Grey Divorce: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రే డివోర్స్ అన్న పదం బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ గ్రే డివోర్స్ అంటే ఏంటి? దీనికి, ఐష్, అభిషేక్ లకి సంబంధం ఏంటి?

ఈ మధ్య గ్రే డివర్స్ అన్న పదం బాగా పాపులర్ అవుతోంది. బాలీవుడ్ లో ఎక్కువగా ఈ పదం వినిపిస్తుంది. దీనికి కారణం ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడివిడిగా కనిపించారు. ఐశ్వర్యారాయ్ తన కూతురితో రాగా.. అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అని వార్తలు వచ్చాయి. దీనికి తోడు అభిషేక్ బచ్చన్ గ్రే డివోర్స్ మీద వచ్చిన పోస్టుని లైక్ చేయడంతో ఈ పదం మరింత ట్రెండ్ అవుతోంది. అసలు ఈ గ్రే డివోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. వారి కోసం ఈ కథనం.    

అభిప్రాయబేధాలు తలెత్తినప్పుడు దంపతులు విడిపోవడం అనేది జరగడం సహజమే. అయితే ఇటీవల కాలంలో పెళ్ళైన మూడు, నాలుగేళ్లకే విడాకులు తీసుకునేవారు ఎక్కువైపోయారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే గ్రే డివోర్స్ అనేది ఎందుకు ట్రెండ్ అవుతుంది అని అంటే దానికొక కారణం ఉంది. వృద్ధులు తీసుకునే విడాకులను గ్రే డివోర్స్ అంటారు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచి పోషించడం బాధ్యతగా భావించి.. వారి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి ఉంటూ పిల్లలు స్థిరపడ్డాక, పెళ్లిళ్లు అయ్యాక విడిపోతున్న వృద్ధ దంపతులు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య వచ్చిన శతమానం భవతి సినిమా కూడా ఇటువంటిదే. కాకపోతే అది మూవీ కాబట్టి మళ్ళీ కలిశారు. కానీ నిజ జీవితంలో అలా కాదు. ఒక్కసారి కమిట్ అయితే ఇక కలవాలి అని అనుకోరు.

జుట్టు తెల్లబడ్డాక చేసుకునే డివోర్స్ కాబట్టి దీనికి గ్రే డివోర్స్ అన్న పేరు వచ్చింది. దీన్నే డైమండ్ డివోర్స్ అని కూడా అంటారు. ఇటీవల కాలంలో మన దేశంలో ఈ గ్రే డివోర్స్ కల్చర్ బాగా ఎక్కువైంది. కానీ విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది ఈ ట్రెండ్. సామజిక, మానసిక ఒత్తిడి, భాగస్వామి మీద అవిశ్వాసం వంటివి గ్రే డివోర్స్ కి ప్రధాన కారణాలు. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక విషయాల్లో అభిప్రాయబేధాలు వంటి వాటి వల్ల విడిపోవాలని అనుకుంటారు. మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ లు 20 ఏళ్ళు కలిసి ఉండి ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా 15 ఏళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. అర్జున్ రాంపాల్, మెహర్ జెస్సియా 21 ఏళ్ల తర్వాత విడిపోయారు. భారతదేశంలో సామాన్యుల కంటే కూడా సెలబ్రిటీల్లో ఎక్కువగా ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ గ్రే డివోర్స్ ట్రెండ్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కూడా చేరిపోయారన్న వార్తలు వస్తున్నాయి.

Show comments