సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ముంబై ఆఫీసులో అవినీతి జరిగిందంటూ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు లంచం తీసుకుందంటూ పక్కా ఆధారాలతో సహా ఆయన వీడియో విడుదల చేశారు. ఈ అవినీతిని తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఒక స్టార్ హీరో సెన్సార్ బోర్డుపై ఇలా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.
విశాల్ ఆరోపణలపై తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమని తెలిపింది. ‘సీబీఎఫ్సీలో జరిగిన అవినీతి మీద విశాల్ బయటపెట్టిన అంశం దురదృష్టకరం. దీనిపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్‌ను వెంటనే ముంబైకి పంపాం. ఒకవేళ తప్పు జరిగినట్లే తేలితే శిక్ష తప్పదు. అప్పటిదాకా ప్రతి ఒక్కరూ ప్రసార మంత్రిత్వ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సీబీఎఫ్సీ వేధింపులకు సంబంధించిన సమాచారం ఉంటే మాకు ఇవ్వండి’ అని ట్విట్టర్లో ప్రసార మంత్రిత్వ శాఖ ఒక పోస్ట్ పెట్టింది. విశాల్ ఆరోపణలకు రియాక్షన్‌గా సమాచార, మంత్రిత్వ శాఖ ట్వీట్ చేయడం మీద బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్‌లు స్పందించాయి.
ముంబై సెన్సార్ బోర్డులో ఎప్పుడూ తమకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు తెలిపాయి. సీబీఎఫ్సీ-ప్రసార, మంత్రిత్వ శాఖ రెండింటితోనూ తమకు సత్సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. మా మొదటి సినిమా ‘దిల్ చాహ్తా హై’ నుంచి ఇటీవలి ‘ఫక్రే 3’ దాకా ఎలాంటి ఇబ్బందులు, అవినీతి కానీ ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. సెన్సార్ బోర్డు పూర్తి నిబద్ధత, పారదర్శకతతో పనిచేస్తోందని వివరించింది. అయితే ఈ విషయంలో నెటిజన్స్ నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ మీద ఎలాంటి కామెంట్ చేసినా వాళ్లు తట్టుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నటి హరితే విడాకులంటూ వార్తలు!
The issue of corruption in CBFC brought forth by actor @VishalKOfficial is extremely unfortunate.
The Government has zero tolerance for corruption and strictest action will be taken against anyone found involved. A senior officer from the Ministry of Information & Broadcasting…
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 29, 2023
At Excel Entertainment, we have had a collaborative relationship with both @CBFC_India and @MIB_India since 2001, and we can indubitably attest to their unwavering commitment to transparency and fair management . Throughout our extensive partnership, from our first film, Dil…
— Excel Entertainment (@excelmovies) September 29, 2023