Venkateswarlu
ఎందుకు తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడ్డం లేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు విక్రమ్ సమాధానం ఇస్తూ.. ‘‘ బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు బాగా ఆడాయి.
ఎందుకు తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడ్డం లేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు విక్రమ్ సమాధానం ఇస్తూ.. ‘‘ బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు బాగా ఆడాయి.
Venkateswarlu
విక్రమ్ ‘తంగాలన్’ సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. బుధవారం హైదరాబాద్‌లో ‘తంగాలన్’ ఈవెంట్ జరిగింది. విక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌తో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఓ జర్నలిస్ట్ ‘‘ తెలుగు నిర్మాతలు, హీరోలు మార్కెట్‌ను విస్తరించాలని అనుకున్నప్పుడు.. వాళ్లు తరచుగా ఏం చెబుతున్నారంటే.. తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలు చూసినంతగా.. తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడరు అని అంటున్నారు. దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించిన ప్యాన్ ఇండియా సినిమాలు.. పర్ఫార్మెన్స్‌తో సంబంధం లేకుండా తమిళనాడులో ఆడలేకపోయాయి.
ఎందుకు తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడ్డం లేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు విక్రమ్ సమాధానం ఇస్తూ.. ‘‘ బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు బాగా ఆడాయి. నిజానికి తమిళ్‌లో టాప్ మూవీస్‌లో అవి కూడా ఉన్నాయి. తమిళనాట తెలుగు సినిమాల ప్రాధాన్యత గురించి చెప్పాలంటే.. నేను ఐ సినిమాకు నేషనల్ అవార్డు కోసం ట్రై చేస్తున్నాను. అప్పుడు జాతీయ అవార్డుల జ్యూరీలో ఒకరైన ఓ తమిళ వ్యక్తి నాతో ‘‘ నేను బహుబలికి నేషనల్ అవార్డు ఇద్దామనుకుంటున్నాను’’ అని నాతో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతుంది కదా తమిళనాట తెలుగు సినిమాల ప్రాధాన్యత. చాలా సినిమాలకు తమిళంలో ప్రాధాన్యత ఉంటోంది.
కాంతార బాగా ఆడింది. కేజీఎఫ్ కూడా బాగా ఆడింది. మా సినిమాల కంటే ఇతర భాషల సినిమాలు బాగా ఆడుతున్నాయి’’ అని అన్నారు. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ ‘‘ సార్ నేను ఏమి చెబుతున్నానంటే.. హిందీలో ప్రమోట్ చేసినంతగా.. తమిళంలో కొంతమంది నిర్మాతలు, హీరోలు తమ సినిమాను తమిళంలో ప్రమోట్ చేయటం లేదు. ‘ఎందుకు’ అని నేను వాళ్లను అడిగితే.. తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలను దూరంపెడుతున్నారు అనిచెప్పారు. దీనికి విక్రమ్ పక్కన ఉన్న వ్యక్తి సమాధానం ఇస్తూ.. ‘‘ అది నిజం కాదు.. బహుబలి తమిళంలో కలెక్షన్లలో టాప్‌లో నిలిచింది’’ అని చెప్పుకొచ్చారు. మరి, జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విక్రమ్ చెప్పి సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Vikram Thrashes the statement “Tamil People do not watch Telugu Films”#Thangalaan pic.twitter.com/abMMuhj82c
— Daily Culture (@DailyCultureYT) November 1, 2023