P Krishna
ఈ మద్య సినీ, రాజకీయ, క్రీడా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు.
ఈ మద్య సినీ, రాజకీయ, క్రీడా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు.
P Krishna
ఇటీవల సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబాలే కాదు.. ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు, ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు. సంగీత ప్రపంచంలో తన గానంతో కోట్ల మంది అభిమానులను సంపాదించిన సింగర్స్ చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ క్లాసికల్ సింగర్ ప్రభా ఆత్రే ఒకరు. తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె శనివారం కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
లెజెండరీ క్లాసికల్ సింగర్, పద్మ అవార్డు గ్రహీత ప్రభా ఆత్రే (91) శనివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడటంతో కుటుంబ సభ్యులు పూనేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గుండెపోటుతో కన్నుమూశారు. పూనేలో అబాసాహబ్, ఇందిరాబాయి దంపతులకు ప్రభా ఆత్రే సెప్టెంబర్ 13, 1932 లో జన్మించారు. తన ఎనిమిదేళ్ల వయసులో తన తల్లి ఇందిరాబాయి కోసం సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకొని తన అద్భుతమైన గానంతో ఎంతోమందిని అభిమానాన్ని సంపాదించారు. ఆత్రే శాస్త్రీయ గాయకురాలు మాత్రమే కాదు.. ఉన్నత విద్యావంతురాలు. తన కెరీర్‌లో విద్యావేత్త, పరిశోధకురాలిగా, స్వర కర్త, రచయిత్రిగా రాణించారు.
ప్రభా ఆత్రే ప్రతిభకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ విభూషన్, పద్మ భూషన్ పురస్కారాలు అందుకున్నారు. ఆమె ఎన్నో దేశాల్లో తన సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె సేవలకు గాను 1991 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. వీటితో పాటు దీనానాథ్ మంగేష్కర్, పూణే విశ్వ విద్యాలయం నుంచి జీవిత సాఫల్య పురస్కారం, శివ సేన ననుంచి మహిమ్ రత్న, ఫైయాజ్ అహ్మద్ ఖాన్ స్మారక అవార్డు, ఠాగూర్ అకాడమీ రత్న అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు విదేశఆల్లో నివసిస్తున్నారు. వారు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ప్రభా ఆత్రే మృతి పట్ల సినీ, రాజకీయ, అభిమానులు సంతాపం ప్రకటించారు.