Krishna Kowshik
వర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్‌ను జులై 3న వివాహం చేసుకుంది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు. అయితే..
వర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్‌ను జులై 3న వివాహం చేసుకుంది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు. అయితే..
Krishna Kowshik
దక్షిణాదిలో స్టార్ హీరోల పిల్లలు హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. వాళ్లకు గ్రాండ్ లాంచ్ ఉంటుంది. కానీ ఆడ పిల్లల విషయంలో అలా కాదు. ఎన్నో ఆంక్షలు ఉంటాయి. వాటిని దాటుకుని రాణిస్తున్నారు కొంత మంది స్టార్ ఫీమేల్ కిడ్స్. వారిలో ఒకరు వరలక్ష్మీ శరత్ కుమార్. తండ్రి నుండి నటనను వారసత్వంగా తీసుకున్న వరు.. అనతి కాలంలో ఆ ముద్రను చెరిపేసుకుని తనకంటూ సొంత పాథ్ ఏర్పాటు చేసుకుంది. దక్షిణాది ఇండస్ట్రీని మడతపెట్టేస్తుంది. ఈ రంగంలోకి వచ్చి దాదాపు పుష్కర కాలమైనా.. ఆమె క్రేజ్ కానీ, ఆఫర్లు కానీ తగ్గలేదు. వర్సటైల్ యాక్టర్‌గా.. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. తెలుగులో రావడానికి కాస్త ఆలస్యమైనా.. తన యాక్టింగ్‌తో వరుస ఆఫర్లు కొల్లగొడుతుంది. ఇటీవల ఆమె కొత్త ఫేజ్‌లోకి వెళ్లింది.
ప్రియుడు, వ్యాపారవేత్త, ఆర్టిస్ట్ నికోలయ్ సచ్ దేవ్‌ను వివాహం చేసుకుంది. జులై 3న నికోలాయ్, వరలక్ష్మీ వివాహం ధాయిలాండ్‌లోని క్రాబీలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహతంతు ముగిశాక.. ఇండియాకు తిరిగి చేరుకున్న ఈ జంట.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. దక్షిణాది ఇండస్ట్రీలో ప్రముఖులంతా విచ్చేశారు. ఇదిలా ఉంటే.. ఈ జంట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నికోలయ్ సచ్ దేవ్ మీడియాతో ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘పెళ్లి తర్వాత వరలక్ష్మీని తన పేరును మార్చుకోవాలని అనుకుంది. శరత్ కుమార్ పేరుని అలానే ఉంచి తన పేరును యాడ్ చేయాలని అనుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్‌గా మార్చుకుందాం అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆమె పేరుని నేనే తీసుకుంటాను’ అని చెప్పాడు.
ఇక నుండి తన పేరు ‘నికోలాయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్‘గా మార్చకుంటున్నాను అని పేర్కొన్నాడు. ఆ విధంగా చేస్తే శరత్ కుమార్, వరలక్ష్మీ నుండి వచ్చే వారసత్వం జీవితాంతం కొనసాగుతుంది అని చెప్పుకొచ్చాడు సచ్ దేవ్. తన వైఫ్ ఇకపై సినిమాలు కొనసాగిస్తుందని, మీ అందరూ తనపై ప్రేమ కురిపిస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ అని చెప్పాడు. ఆమె ఫస్ట్ లవ్ సినిమాలే.. ఆ తర్వాతే తాను అంటూ వరుని ఓ రేంజ్‌లో పొగిడిచేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె భర్తపై ప్రశంసలు వస్తున్నాయి. ఇది ఆమెకు గిఫ్ట్ అనే చెప్పాలి. పెళ్లి కాగానే భర్త ఇంటి పేరు మార్చుకోవాలని పోరు పెడుతుంటారు చాలా మంది భర్తలు. కానీ సచ్ దేవ్ చాలా డిఫరెంట్. సెలబ్రిటీల్లో ఇలా చేయడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇక ఈ ఏడాది హనుమాన్, శబరి మూవీలతో అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. కన్నడ చిత్రం మాక్స్, తమిళంలో రాయన్ చిత్రాలు చేస్తుంది.
இனி என் பெயர் Nicholai Varalaxmi SarathKumar❣️
Full Video👉https://t.co/6g3gufWoo1#varalaxmisarathkumar #nicholaisachdev #varalaxminicholai #sarathkumar pic.twitter.com/2U6cTs5UGo— PTPrime (@pttvprime) July 16, 2024