Somesekhar
మెగా కోడలు ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన తాత ప్రతాప్ సి రెడ్డి బయోపిక్ ను తీస్తానని ఆయన బర్త్ డే సందర్భంగా చెప్పుకొచ్చింది.
మెగా కోడలు ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన తాత ప్రతాప్ సి రెడ్డి బయోపిక్ ను తీస్తానని ఆయన బర్త్ డే సందర్భంగా చెప్పుకొచ్చింది.
Somesekhar
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో ప్రముఖుల జీవితాలు వెండితెరపై ఆవిష్కృతం అయ్యాయి. అందులో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి కూడా. పొలిటికల్ లీడర్లు, దిగ్గజ క్రికెటర్లు, దిగ్గజ హీరోలతో పాటుగా ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలు సినిమాలుగా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ సిల్వర్ స్క్రీన్ పై రావడానికి సిద్దమౌతోంది. ఆ జీవిత చరిత్ర ఎవరిదో కాదు.. వైద్య రంగంలో సంచలనాలు సృష్టించిన అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మనవరాలు, మెగా కోడలు ఉపాసన చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించగా.. ఈ సందర్భంగా ఆమె తాత బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అపోలో సంస్థల అధిపతి డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి తాజాగా తన 91వ బర్త్ డే వేడుకలను ఘనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ‘ది అపోలో స్టోరీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ లో ప్రతాప్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగిన తీరు, ఆయన ఆపోలో స్థాపించిన విధానం ఇక ఈ సమయాల్లో ఎదుర్కొన్న కష్టానష్టాలను ఈ బుక్ లో పూర్తిగా వివరించారు. బర్త్ డే వేడుకగా చెన్నై అపోలో ఆస్పత్రిలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మెగా కోడలు, ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన మాట్లాడారు. ఈ బుక్ ప్రతీ తండ్రి చదవాలని, దాంతో పాటుగా ప్రతీ ఒక్కరు స్ఫూర్తి పొందాలని ఆమె పేర్కొన్నారు.
కాగా.. బుక్ రిలీజ్ చేశారు కదా, మీ తాతపై బయోపిక్ తీసే ఆలోచన ఏమైనా ఉందా? అని విలేకరి ఉపాసనను ప్రశ్నిచారు. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ..”అవును ఆ ఆలోచన కూడా చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అది జరగొచ్చు కూడా. అందులో రామ్ చరణ్ నటిస్తాడా? అంటే అది డైరెక్టర్ రాసుకునే కథను బట్టి ఉంటుంది” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఉపాసన. దీంతో త్వరలోనే తాతపై బయోపిక్ రాబోతోందని తెలుస్తోంది. మరి ఆ చిత్రానికి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తారు? హీరో ఎవరు? ఆ వివరాల కోసం సినిమా లవర్స్ ఎదురుచూడక తప్పదు.
ఇదికూడా చదవండి: అస్సలు నమ్మలేకపోయా.. ఆ హీరో కాల్ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు: సందీప్ వంగా