‘ఓ మై బేబీ’ సాంగ్ పై ట్రోల్స్! రచయత సీరియస్ వార్నింగ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటి ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ బయటకు వచ్చాయి. అయితే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటి ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ బయటకు వచ్చాయి. అయితే

మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడవ చిత్రంగా వస్తోంది ‘గుంటూరు కారం’. మూవీకి ఆది నుండి అడ్డంకులే. సినిమా మొదలైన నాటి నుండి నెగిటివిటీని మూటగట్టుకుంటోంది. పూజా హెగ్డే ఈ మూవీ నుండి ఔట్ కావడం, ఆ తర్వాత పలువురు టెక్నీషియన్లు తప్పుకోవడంతో.. ఈ సంక్రాంతికి వస్తుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుని ప్రమోషన్లను కూడా షురూ చేసింది. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల చేసింది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తొలి పాట థమ్ మసాలా విశేష ఆదరణ పొందింది. యూట్యూబ్‌ను కూడా షేక్ చేసేసింది. ఈ క్రమంలో సెకండ్ సాంగ్‌ను వదిలారు మేకర్స్.

‘ఓ మై బేబీ’అంటూ సాగిపోయే సాంగ్‌ బుధవారం రిలీజ్ అయ్యింది. శ్రీలీల, మహేష్ బాబుపై ఈ పాట తెరకెక్కింది. అయితే ఈ పాట అభిమానుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో సంగీత దర్శకుడిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ మ్యూజిక్ ఏంటనీ కారం నూరుతున్నారు. పాట చాలా సాదాసీదాగా ఉందని  ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పాటకు లిరిక్స్ అందించిన రామ జోగయ్య శాస్త్రి, మూవీ దర్శక, నిర్మాతలను సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు. దీనిపై ఘాటు రిప్లై ఇచ్చారు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి. ‘సోషల్ మీడియా చాలా దారుణంగా తయారయ్యింది. ప్రాసెస్ తెలియకుండా కొంత మంది వ్యక్తులు జడ్జ్, కామెంట్లు చేస్తున్నారు. ద్వేషపూరిత ఉద్దేశాలతో నెగివిటీని ప్రచారం చేస్తూ.. టెక్నీషియల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. గీతలు దాటుతున్నారు వీళ్లు’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో కూడా చెప్పాల్సింది చెప్పారు రామజోగయ్య శాస్త్రి. ‘ ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరే వాడే , అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని..? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  ఇది చూసైనా ఇలాంటి నెగిటివ్, వల్గర్ కామెంట్స్ తగ్గుతాయోమో చూడాలి. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో గతంలో అతడు, ఖలేజా వచ్చిన సంగతి విదితమే. చానాళ్ల తర్వాత గుంటూరు కారంతో రాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మరీ ఇటీవల విడుదలైన సెకండ్ సాంగ్ ఎలా ఉందో.. నెటిజన్లు రాస్తున్న రాతలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments