Swetha
మాస్ మహారాజ్ రవి తేజ నటించిన "ఈగల్" సినిమా విడుదల అవ్వడానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎన్నో అప్ డేట్స్ వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు "ఈగల్" సినిమా విడుదల కాకముందే.. ఫస్ట్ డే కలెక్షన్ల గురించి బజ్ నడుస్తోంది.
మాస్ మహారాజ్ రవి తేజ నటించిన "ఈగల్" సినిమా విడుదల అవ్వడానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎన్నో అప్ డేట్స్ వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు "ఈగల్" సినిమా విడుదల కాకముందే.. ఫస్ట్ డే కలెక్షన్ల గురించి బజ్ నడుస్తోంది.
Swetha
రవితేజ నటించిన “ఈగల్” సినిమా.. ఫిబ్రవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కాగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , మేకింగ్ వీడియో ఇలా వరుస అప్ డేట్స్ తో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ చిత్రం. అంతేకాకుండా మూవీ ప్రివ్యూ చూసి స్వయంగా రవి తేజ ఇచ్చిన రివ్యూతో “ఈగల్” చిత్రం పైన ఇంకాస్త ఆసక్తి నెలకొంది. దీనితో పాటు ఈ సినిమా టికెట్ ధరల విషయంలోనూ డేరింగ్ స్టెప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా అంతటా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న “ఈగల్” థియేటర్ లో విడుదల అవ్వడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్న సమయంలో.. ప్రీ రిలీజ్ బిజినెస్ , ఫస్ట్ డే కలెక్షన్స్ అంటూ..కొన్ని అంకెలు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సినిమాను బ్లాక్ బస్టర్ బెస్ట్ హిట్ గా అందించే క్రమంలో.. గత కొద్దీ రోజులుగా చిత్ర బృందం మూవీ ప్రమోషన్లను జోరుగా చేసింది. మీడియా , సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసిన “ఈగల్” వార్తలే వినిపించేవి. ఈ ప్రీ రిలీజ్ లో భాగంగా.. నైజాంలో 6 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్లు అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేసిందని. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాకు రెండు కోట్లు.. ఓవర్సీర్ రెండు కోట్లు.. అలా మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం చూసినట్లయితే.. “ఈగల్” చిత్రం మొత్తంగా దాదాపు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగబోతుందని తెలుస్తోంది.
ఇక మరోవైపు ఇప్పడున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తుంది. ఇక మొదటి రోజే “ఈగల్” మూవీకి సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల గ్రాస్ రావొచ్చని.. ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులోను వీకెండ్ రావడంతో ఖచ్చితంగా వీకెండ్ లోపు.. గ్రాస్ ఈవెన్ ను క్రాస్ చేసేలా ఉందని భావిస్తున్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న ఈ చిత్రం .. బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు సంపాదించేలా ఉంది. ఇక విడుదల తర్వాత “ఈగల్” సినిమా ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, ప్రస్తుతం వినిపిస్తున్న “ఈగల్” బ్రేక్ ఈవెన్ టాక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.