Chandrabose: సొంతూరు పై ప్రేమ చాటుకున్న చంద్రబోస్.. ఏం చేశాడంటే?

ప్రముఖ సినీ రచయిత సుభాష్ చంద్రబోస్ గతంలో తన గ్రామానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో నిర్మించిన ఆస్కార్ గ్రంథాలయం నేడు ప్రారంభించారు.

ప్రముఖ సినీ రచయిత సుభాష్ చంద్రబోస్ గతంలో తన గ్రామానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో నిర్మించిన ఆస్కార్ గ్రంథాలయం నేడు ప్రారంభించారు.

కనుకుంట్ల ‘సుభాస్ చంద్రబోస్’.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ లో ప్రముఖ సినీ గేయ రచయితల్లో ఈయన కూడా ఒకరు. కాగా,ఇప్పటికే తెలుగు సాహిత్యం పై చెరగని ముద్ర వేస్తున్న గేయ రచయిత చంద్రబోస్ కు.. ఇటీవలే అరుదైన గౌరవం దక్కింది. అయితే ఈయనకు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో చంద్రబోస్ కు తన సొంతూరు అయితన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో గ్రామ ప్రజలు ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ సమయంలో చల్లగరిగెలో తనకు దక్కిన గౌరవానికి చంద్రబోస్ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని అప్పుడు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన సొంత జిల్లా అయిన చల్లగరిగెలో ఆస్కార్ గ్రాంథాలయం నిర్మించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ సినీ రచయిత సుభాష్ చంద్రబోస్ తాజాగా తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మించారు. కాగా, గతంలో ఆర్ ఆర్ ఆర్ లో ఆయన రాసిన పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గ్రామంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలో దక్కిన గౌరవంకు ఆయన ఆస్కార్ గ్రాంథలయం ఏర్పాటు చేస్తానని చంద్రబోస్ మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఇది వరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ.36 లక్షలతో  కొత్త భవనాన్ని ఆయన నిర్మించారు.  అలాగే నేడు అనగా జులై అనగా జులై 4వ తేదదీన భూపాలపల్ల ఎమ్మెల్యే గండ్ర త్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.

అయితే ఈ గ్రంథాలయాన్ని రెండంతస్తులతో అన్ని వసతులతో దానిని ఆయన నిర్మించారు. ఇక గ్రామంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువకులకు అవసరమయ్యే అన్నీ పుస్తకాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. సుభాస్ చంద్రబోస్ సుమారు 30 ఏళ్ల కెరీర్‌లో సినీ పాటల రచయితగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. కాగా, ఇప్పటి వరకు ఆయన 860 సినిమాల్లో 3600కిపైగా పాటలు ఆయన రాశారు. ఇకపోతే ఆర్ ఆర్  ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ ముందు ఈయనకు కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును కూడా దక్కిన విషయం తెలిసిందే. మరి, చంద్రబోస్  సొంత గ్రామంలో రెండస్తుల గ్రంథాలయాన్ని ప్రారంభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments