Keerthi
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ జంట ఎవరో గుర్తుపట్టారా.. ఈ ఫోటోలో ఉన్న కనిపిస్తున్న ఆ వ్యక్తికి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా చూడటానికి సింపుల్ గా కనిపించిన ఈయనకు తెలుగులో సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా..
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ జంట ఎవరో గుర్తుపట్టారా.. ఈ ఫోటోలో ఉన్న కనిపిస్తున్న ఆ వ్యక్తికి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా చూడటానికి సింపుల్ గా కనిపించిన ఈయనకు తెలుగులో సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా..
Keerthi
ఇండస్ట్రీలో పరిచయయ్యేవారు చాలామంది ఉంటారు. కానీ,ఇండస్ట్రీ గుర్తించిన వ్యక్తులుగా కొందరే ప్రసిద్ధి చెందుతారు. అయితే వారిలో యాక్టర్స్ కానీ, దర్శకులు, రచయితలు, నిర్మాతలు సింగర్స్ ఇలా ఏ రంగానికి చెందినవారైనా సరే ఇటు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. మరీ అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ జంట ఎవరో గుర్తుపట్టారా.. ఈ ఫోటోలో ఉన్న కనిపిస్తున్న ఆ వ్యక్తికి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా చూడటానికి సింపుల్ గా కనిపించిన ఈయనకు తెలుగులో సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఆయన మరెవరో కాదు.. తెలుగు సినీ పాటల రచయిత భాస్కరభట్ల. ఈయన పూర్తి పేరు ‘భాస్కరభట్ల రవి కుమార్‘. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. తెలుగులోని ప్రముఖ పాటల రచయితల్లో ఈయన కూడా ఒకరు.
ఇకపోతే భాస్కరభట్ల రవి కుమార్ మొదటిగా పాత్రికేయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అందులోనే 10 ఏళ్ల పాటు వృత్తిని కొనసాగించారు.చిన్నతనం నుంచే సాహిత్యంపై మంచి మక్కువ ఉన్న భాస్కరభట్ల ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. ఈ క్రమంలోనే.. ఆయన కవిత్వాలు రాయడం మొదలుపెట్టాడు. అలా తనలో ఉన్నా ప్రతిభను రాణించడం కోసం సినీ గీ రచయితగా మారలకున్నాడు. ఇక తన ఆలోచనలనే అవకాశంగా మలుచుకున్న భాస్కరభట్ల మొదటిగా 2000లో నందమూరి బాలకృష్ణ హీరోగా EVV సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో గీత రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే ఈయనకు తనికెళ్ల భరణి, స్వరకర్త చక్రి ద్వారా గీత రచయితగా ప్రోత్సహం ఎక్కకువగా ఉండేది. ఇలా చక్రి, భాస్కరభట్ల ఇద్దరూ కలిసి దాదాపు 65 చిత్రాలకు పనిచేశారు. ఇకపోతే ఎక్కువగా భాస్కర భట్ల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనే ఎక్కువగా రచయితగా పనిచేశారు.
ఇలా ఇప్పటి వరకు భాస్కరభట్ల ఇండస్ట్రీలో 300కి పైగా సినిమాలకు పాటలు రాశారు. కాగా, వీటిలో ఎక్కువగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలోని “మళ్లీ కుయవే గువ్వ”, పోకిరిలోని “ఇప్పటికింకా నా వయసు” , బొమ్మరిల్లులోని “బొమ్మను గీస్తే “, జల్సాలోని “గాల్లో తేలినట్టుందే” , బంపర్ ఆఫర్‌లోని “పెళ్లెందుకే రావణమ్మ వంటి పాటలు ఆయనకు ఫుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అయితే తెలుగు పాటలనే రాయడం ఒక ఎత్తు అయితే తమిళ్ పాటలను డబ్ చేసి తెలుగులో రాయడం అనేది కత్తి మీద సాము వంటిది.అలాంటిది భాస్కరభట్ల సూర్య తమిళ్ సినిమా (సూరారై పొట్రూ) ఆకాశం నీ హద్దూరా సినిమాలో కాటుక కనులే అనే పాట రాసి తెలుగులో రాసి సంచలనం సృష్టించాడు. ఒక రకంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో రచయితగా పాటలు రాసిన భాస్కరభట్ల పలు అవార్డులను కూాడ గెలుసుకున్నాడు. ముఖ్యంగా 2013లో మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాలో సర్ ఒస్తారా పాటకు ఉత్తమ గీత రచయితగా గా SIIMA అవార్డును గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న డబుల్ ఇస్మార్ట్ మూవీలోని ‘స్టెప్పమార్’ సాంగ్ కు కూడా భాస్కరభట్ల అదిరిపోయే లిరిక్స్ ను అందించారు. ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఊపందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిస అవసరం లేదు.
ఇక భాస్కర భట్ల కుటుంబ నేపథ్యానికి వస్తే..ఈయన శ్రీకాకుళం జిల్లాలో గార మండలం బూరవెల్లి గ్రామములో జూన్ 5వ తేదీ 1974లో జన్మించారు. ఈయన తెలుగులో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత.. హైదరాబాద్ వచ్చి పాత్రికేయుడు రంగంలో వృత్తిని కొనసాగించారు. అయితే ఈయనకు ఆగస్టు 13 1998న వరంగల్‌లో B.Sc గ్రాడ్యుయేట్ అయిన లలితను వివాహం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతానికి వీరిద్దరికి అమంత, సంహిత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భాస్కరభట్ల పెళ్లినాట ఫోటో ప్రస్తుతం సోషల్ వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో ఈ జంటను గుర్తుపట్టాడం నెటిజన్స్ కు చాలా కష్టంగా అనిపించింది. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సినీ గేయ రచయిత భాస్కరభట్ల పెళ్లినాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.