PVR INOX పై మండి పడుతున్న తెలుగు ప్రేక్షకులు

Telugu Fans Fire On PVR INOX: పీవీఆర్ ఐనాక్స్ ఇటీవల మూవీ పాస్ట్ పోర్ట్ కొత్త వర్షన్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకన తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు పీవీఆర్ ఐనాక్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు.

Telugu Fans Fire On PVR INOX: పీవీఆర్ ఐనాక్స్ ఇటీవల మూవీ పాస్ట్ పోర్ట్ కొత్త వర్షన్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకన తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు పీవీఆర్ ఐనాక్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులు మల్టీప్లెక్స్ సంస్థ PVR INOXపై మండిపడుతున్నారు. దానికి కారణం ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన టికెట్ పాస్‌పోర్ట్ సరైన విధంగా పని చేయకపోవడమే. PVR పాస్‌పోర్ట్ అనేది భారతదేశంలోని ప్రముఖ సినిమా థియేటర్ చైన్ అయిన PVR INOX సినిమాస్ అందించే ఒక సబ్‌స్క్రిప్షన్ సర్వీస్. ఇది ప్రేక్షకులను తక్కువ టికెట్ ధరకు సాధారణ స్థాయి కంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలను చూడటానికి అనుమతిస్తుంది.

PVR పాస్‌పోర్ట్‌లో రెండు వెర్షన్‌లు ఉన్నాయి. PVR పాస్‌పోర్ట్ మొదటి విడత విషయానికి వస్తే ఇది పరిమిత కాలానికే అమలులో ఉండే ఆఫర్ గా మొదలుపెట్టారు. ప్రేక్షకులు 699 రూపాయలను వన్-టైమ్ ఫీజు లాగా చెల్లిస్తే దానికి బదులుగా ఒక నెలలో 10 సినిమాలని చూసే అవకాశం ఈ పాస్ అందించింది. తాజాగా PVR పాస్‌పోర్ట్ 2 అంటూ కొత్త వెర్షన్ ని తెచ్చిందీ మల్టీప్లెక్స్ సంస్థ. అందులో ఒకటి నెలకు నాలుగు సినిమాలను చూసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ పాస్ కొనాలంటే 349 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకో ప్లాన్ 1047 రూపాయలు చెల్లించి 12 సినిమాలు చూడవచ్చు. ఈ రెండవ ప్లాన్ 90 రోజుల వరకూ వర్తిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాస్ కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అయితే ఇటీవలే అనౌన్స్ చేసిన కొత్త PVR పాస్‌పోర్ట్‌లో మొదట హైదరాబాద్ నగరానికి చోటు దక్కలేదు. దీంతో సహజంగానే తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో PVR సంస్థను టాగ్ చేస్తూ ట్రెండ్ చేశారు. ఎట్టకేలకు హైదరాబాద్ ను కూడా కొత్త పాస్‌పోర్ట్‌ అందుబాటయ్యే లిస్టు లోకి చేర్చింది పీవీఆర్. అయితే ఎంతో ఆనందంగా కొత్త పాస్‌పోర్ట్‌ కోసం సబ్ స్క్రైబ్ అయిన తెలుగు ప్రేక్షకులకి నిరాశే మిగిలింది. పాస్‌పోర్ట్ కొన్న తర్వాత ఏ సినిమాకి టికెట్ బుక్ చేయాలని చూసినా ఎర్రర్ మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యారు. డబ్బు మొత్తం కట్టేసిన తరువాత నచ్చిన సినిమా టికెట్ బుక్ చేసుకునే వీలు లేకపోవడంతో నెటిజన్లకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఈ థియేటర్/స్క్రీన్ కు మీ పాస్ చెల్లదు అంటూ వచ్చిన మెసేజెస్ ను ప్రస్తుతం PVR INOX ను ట్విట్టర్ లో టాగ్ చేస్తూ ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాలి.

Show comments