కల్కి 2898 AD వాటి కోసం తీయలేదు! నిర్మాత స్వప్న దత్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Swapna Dutt: జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు నాలుగున్నరేళ్ల నిరీక్షణ తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక రికార్డులను క్రియేట్ చేసే దిశాల వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆ సినిమా నిర్మాత ఆసక్తికరమైన పోస్టు చేశారు.

Swapna Dutt: జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు నాలుగున్నరేళ్ల నిరీక్షణ తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక రికార్డులను క్రియేట్ చేసే దిశాల వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆ సినిమా నిర్మాత ఆసక్తికరమైన పోస్టు చేశారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కల్కి మేనియానే కనిపిస్తుంది.  ఎవరిని కదిలించినా కూడా కల్కి గురించే తెగ చర్చనడుస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు నాలుగున్నరేళ్ల నిరీక్షణ తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి  కల్కి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారతీయ సినీ హిస్టరీలో కల్కి ఓ కలికితురాయి అని అంటున్నారు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హాలీవుడ్ ను ఏ మాత్రం తీసిపోని విధంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కల్కిని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాపై ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరి చూపులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు కల్కి సినిమా రికార్డుల గురించి అడిగిన ప్రశ్నలకు కల్కి ప్రొడ్యూసర్ స్వప్న దత్ సమాధానం ఇచ్చారు.

తాజాగా సోషల్ మీడియాలో కల్కి ప్రొడ్యూసర్ స్వప్న దత్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. చాలా మంది ఫోన్ లు చేసి చెబుతున్నారు. మనం రికార్డులను క్రాస్  చేశామా అంటూ కొందరు అడుగుతున్నారని ఆమె తెలిపింది. అయితే ఇది తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపింది. తాము ఎప్పుడు రికార్డుల కోసం సినిమాను నిర్మించడం లేదని తెలిపింది. తాము సినిమాలను ప్రేక్షకుల కోసమే తీస్తున్నామని, అంతేకాక సినిమాపై ఉండే ప్రేమతో వాటిని నిర్మిస్తున్నామని తెలిపింది. కల్కి సినిమాను రికార్డుల కోసం తీయలేదని ఈ పోస్టు ద్వారా స్వప్న దత్ పరోక్షం చెప్పారు.  సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ పోస్టు ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. మైథలాజికల్ మూవీ కల్కి2898 ఏడీ దర్శకుడు తెరకెక్కించాడు. ఇతిహాసగాధలకు సైన్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో మూవీ ప్రియులను కనువిందు చేశాడు. ఈ సినిమాలో అమితాబ్, దీపికా, దిశా పటానీ, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజ స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫరియా, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఆర్జీవీ వంటి స్టార్స్ క్యామియో రోల్స్ చేశారు. ఇక ఇప్పటికే తొలి రోజు 200 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అలానే అడ్వాన్స్ బుకింగ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  ప్రస్తుతం స్వప్న దత్ చేసిన పోస్టుపై మీ
అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments