iDreamPost
iDreamPost
చాలా గ్యాప్ తర్వాత సూర్య థియేటర్ లో దర్శనమివ్వబోతున్నాడు. ఈ నెల 10న విడుదల కాబోతున్న ఈటి మీద విపరీతమైన అంచనాలు లేవు కానీ టాక్ వస్తే మాత్రం మన ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. అయితే ఒక్క రోజు గ్యాప్ తోనే రాధే శ్యామ్ వస్తున్నందున అజిత్ వలిమై భీమ్లా నాయక్ వల్ల ఎదురుకున్న థియేటర్ల చిక్కులు దీనికీ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. సూర్య మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. తమిళం కంటే ఎక్కువగా తెలుగు మీద ఫోకస్ పెట్టి ముందు ఇక్కడి వెర్షన్ కే డబ్బింగ్ చెప్పి హైదరాబాద్ లో రెండు మూడు రోజులు ఉండి మరీ ప్రమోషన్లు గట్రా పూర్తి చేసుకున్నాడు. ఈటి మీద కాన్ఫిడెన్స్ ఆ రేంజ్ లో ఉంది మరి.
ఇదిలా ఉండగా కమర్షియల్ జానర్ నుంచి సూర్య మెల్లగా పక్కకు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఓటిటిలో డైరెక్ట్ గా వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లు ఎంతో గొప్ప చిత్రాలుగా పేరు తెచ్చుకుని ఆస్కార్ కు ప్రయత్నించినప్పటికీ థియేట్రికల్ గా ఇవి అద్భుతాలు చేసేవా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఇప్పుడు వెట్రిమారన్ తో చేస్తున్న వడివాసల్ కూడా డిఫరెంట్ జానర్ లో రూపొందుతున్న చిత్రమే. నెక్స్ట్ బాలాతో ప్లాన్ చేసుకున్నారు. శివపుత్రుడుతో సూర్యకు మొదటి గుర్తింపు తెచ్చింది ఈయనే. అందులో క్యారెక్టర్ ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంత గొప్పగా ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం శాశ్వతంగా గుర్తుండిపోయింది.
కానీ ఒకప్పటి బాలా అదే మేజిక్ ని రిపీట్ చేయగలరా అనేదే ఫ్యాన్స్ అనుమానం. ఆ మధ్య అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ని ముందు బాలానే తీశారు. అది మరీ దారుణంగా వచ్చిందని మళ్ళీ కొత్త వెర్షన్ ని డెబ్యూ డైరెక్టర్ గిరిశాయతో తీయించారు.ఇది ఒకరకంగా బాలా దర్శకత్వ ప్రతిభను అవమానించడమే. సరే ఆయన దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోలేదు. విక్రమ్ తో ఉన్న స్నేహం కొద్దీ అది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే అయినప్పటికీ వదిలేశారు. అలాంటి బాలాతో సూర్య టైఅప్ కావడం ఆశ్చర్యకరమే. వెట్రిమారన్ సబ్జెక్టు కూడా చాలా సీరియస్ టోన్ లో సాగుతుందట. చూస్తుంటే మాస్ కి త్వరలోనే గుడ్ బై చెప్పేలా ఉన్నారు
Also Read : Thaman S : శుక్రమహర్దశ అనుభవిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్