Krishna Kowshik
పని ప్రదేశాల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి తమ గళాన్ని ఎత్తారు బాధిత మహిళలు. ఇదో ఉద్యమంగా మారింది. అదే మీటూ.. 2018లో ప్రారంభమైన ఈ ఉద్యమం దావనంలా ప్రపంచం మొత్తం అంటుకుపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని కుదిపేసింది.
పని ప్రదేశాల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి తమ గళాన్ని ఎత్తారు బాధిత మహిళలు. ఇదో ఉద్యమంగా మారింది. అదే మీటూ.. 2018లో ప్రారంభమైన ఈ ఉద్యమం దావనంలా ప్రపంచం మొత్తం అంటుకుపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని కుదిపేసింది.
Krishna Kowshik
తమపై లైంగిక వేధింపులకు సంబంధించి.. ఇటీవల కాలంలో మహిళలు గళం విప్పారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ ఉద్యమం జోరుగా నడిచింది. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం.. ఇండియాకు పాకింది. మన దేశంలో కూడా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా.. మీటూ ఉద్యమం ఇండస్ట్రీలను కుదిపేసింది. హీరోయిన్స్, సింగర్స్, నటీమణులు ఇలా చాలా మందే పని ప్రదేశాల్లో తమపై జరిగిన లైంగిక కాండ గురించి ఆవేదన వ్యక్త పరిచారు. అందులో ఒకరు ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. కోలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తులోని వక్రబుద్దిని బయటపెట్టిన సంగతి విదితమే. తనను అతడు లైంగికంగా వేధించాడంటూ తీవ్ర విమర్శలు చేసింది.
వైరముత్తుపై ఎప్పుడైతే తీవ్ర విమర్శలు చేసిందో తమిళనాడు ఇండస్ట్రీ చిన్మయిపై బ్యాన్ విధించింది. కానీ ఆమె సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించలేదంటూ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తన గళాన్ని సోషల్ మీడియా ద్వారా వినిపిస్తూనే ఉంది. నాలుగేళ్ల నిషేధం తర్వాత ఇటీవల లియో మూవీలో త్రిషకి డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మరోసారి వైరముత్తుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. వైరముత్తు రాసిన మహా కవితై పుస్తకావిష్కరణ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, లోక నాయకుడు కమల్ హాసన్, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదరంబరం హాజరయ్యారు. తాను ఆరోపణలు చేస్తున్న వైరముత్తుకి.. వారంతా సపోర్టు చేయడంపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ..ఓ ట్వీట్ చేసింది.
‘ నన్ను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తితో (వైరముత్తు) తమిళనాడుకు చెందిన కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు (కమల్, స్టాలిన్, చిదంబరం)వేదికను పంచుకున్నారు. ఆయనపై ఆరోపణలు చేసినందుకు నన్ను బ్యాన్ చేశారు. నా కెరీర్ నాశనమైంది. నిజాయితీగా మాట్లాడే వారిని నిర్బంధించడం, వారి కెరీర్ నాశనం చేస్తూ.. లైంగిక నేరస్థులను ప్రోత్సహిస్తూ, మద్దతు తెలిపేలా వ్యవస్థ మారిపోయింది. నా కోరిక నెరవేరే వరకు ప్రార్థిస్తూనే ఉంటాను. ఏదైమైన్పటికీ నేను చేయగలిగిందీ ఏమీ లేదు’ అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ఈ స్టార్ సింగర్ చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned – years of my career lost.
May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV
— Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024