తలైవా సూపర్ స్టార్.. ప్రస్తుతం జైలర్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 10న జైలర్ రిలీజ్ కాబోతుండగా.. చిత్రయూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన సాంగ్స్ అన్ని సోషల్ మీడియాలో ఊపేస్తున్నాయి. మరోవైపు కావాలా అనే సాంగ్ ఏకంగా వరల్డ్ వైడ్ సంగీత ప్రియులను అలరిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న జైలర్ మూవీని డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో జైలర్ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజాగా జైలర్ ఆడియోను చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ చేసింది మూవీ యూనిట్. ఈ ఈవెంట్ లో రజినీకాంత్, తమన్నా, శివ రాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ స్పెషల్ పెర్మార్మెన్స్ అదిరిపోయింది. అయితే.. సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ ఎవరో తెలుసు కదా! తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయిన కావ్య మారన్ తండ్రి. ఇంతకీ కావ్య ఎవరో తెలుసుగా.. ఐపీఎల్ సన్ రైజర్స్ టీమ్ యజమాని. కావ్య పాప గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కొన్నేళ్లుగా ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే.. జైలర్ ఈవెంట్ లో కావ్య పాప టాపిక్ తెచ్చారు రజినీ.
ఆయన మాట్లాడుతూ.. “సన్ రైజర్స్ జట్టు మ్యాచ్ ఓడిపోయినప్పుడు కావ్య మారన్ పడే బాధను చూడలేకపోతున్నాను. స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటం చూసి.. చాలాసార్లు చూడలేక ఛానల్ కూడా మార్చేసే వాడిని. ఈసారి ఆక్షన్ లో మంచి ప్లేయర్ లను తీసుకోవాలి. టీమ్ లో మంచి ప్లేయర్ ఉండాలి. ఆడుతున్న ప్రతి మ్యాచ్ గెలవాలనే కసి ఉన్న క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించాలి’ అని కళానిధి మారన్ కి సలహా ఇచ్చారు. అయితే.. కొన్నాళ్ళుగా సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ లో ఘోరంగా విఫలం అవుతున్న సంగతి తెలిసిందే. 2020లో మూడో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్.. ఆ తర్వాత పూర్తిగా డౌన్ లో ఉండిపోయింది. మరి కావ్య గురించి, రజినీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.