Sundeep Kishan Distributes Free Food: సందీప్‌ కిషన్‌ మంచి మనసు.. వారి కోసం ప్రతి నెలా రూ.4 లక్షలు

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ మంచి మనసు.. వారి కోసం ప్రతి నెలా రూ.4 లక్షలు

Sundeep Kishan Distributes Free Food: హీరో సందీప్‌ కిషన్‌ ప్రతి రోజు పేదల కోసం సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎలా అంటే..

Sundeep Kishan Distributes Free Food: హీరో సందీప్‌ కిషన్‌ ప్రతి రోజు పేదల కోసం సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎలా అంటే..

సెలబ్రిటీలు అంటే వారికేంటి.. కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు.. లగ్జరీ జీవితం గడుపుతారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే వారు ఎంజాయ్‌ చేయడమే కాదు.. సమాజానికి ఎంతో కొంత సాయం చేస్తారు. చాలా మంది హీరోహీరోయిన్లు తాము చేసే సమాజ సేవా కార్యక్రమాలు, దానధర్మాల గురించి బయటకు చెప్పుకొరు. ఎప్పుడో మాటల సందర్భంలో అనుకోకుండా వారు చేసే సేవా కార్యక్రమాల గురించి బయటకు వస్తుంది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ఎన్నో వందల మంది చిన్నారులకు హార్ట్‌ ఆపరేషన్లు చేయించే సంగతి మూడునాలుగేళ్ల క్రితం వరకు చాలా మందికి తెలియదు. ఈ జాబితాలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఇక తాజాగా హీరో సందీప్‌ కిషన్‌ గురించి కూడా ఇలాంటి వార్త తెలిసింది. ఆయన ప్రతి రోజు వందల మంది ఆకలి తీరుస్తున్నాడు. అందుకోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఆ వివరాలు..

టాలీవుడ్‌ మోస్ట్‌ టాలెంటెడ్‌ హీరోల జాబితాలో సందీప్‌ కిషన్‌ కూడా ఉంటారు. సినిమా రిజల్ట్స్‌తో పని లేకుండా భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. భైరవకోన సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సందీప్‌ కిషన్‌. ప్రస్తుతం హీరో ధనుష్‌ నటిస్తోన్న రాయన్‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రేపే అనగా జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సందీప్‌ కిషన్‌ గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రతి రోజు లక్షలు ఖర్చు చేసి.. వందల మంది పేదల ఆకలి తీరుస్తున్నాడు.

సందీప్‌ కిషన్‌.. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్‌ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సిటీలో మొత్తం ఇవి ఏడు బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్‌ నుంచి రోజూ ఉచితంగా 50 మందికి భోజనం పంపిస్తున్నాడట. అవసరం ఉన్న పేదలు, కూలీలు, అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలకు డైలీ ఒక్కో రెస్టారెంట్ నుంచి 50 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు. అంటే రోజూ సుమారు 350 మంది పేదల కడుపు నింపుతున్నాడన్నమాట. అలాగే దాదాపు నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

‘‘ఒక హీరోగా ప్రజలకు నేనేమి చేయగలను అని ఆలోచించినప్పుడు రెస్టారెంట్స్ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాను. అలాగే ఎంతో మంది కడుపు నింపుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు సందీప్‌ కిషన్‌. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సందీప్‌ కిషన్‌.. ఒక వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాల్లోనూ స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కలిసి కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు వీరిద్దరు మళ్లీ కలిశారు. రాయన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తుండగా, సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం జులై 26న తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల కానుంది.

Show comments