Swetha
ఇప్పటివరకు థియేటర్స్ లో రిలీజ్ అయినా ప్రతి సినిమా OTT లోకి వచ్చింది. కానీ మొదటి సారి OTT లో రిలీజ్ అయినా సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు ఇలా ఏ సినిమాకు జరగలేదు.
ఇప్పటివరకు థియేటర్స్ లో రిలీజ్ అయినా ప్రతి సినిమా OTT లోకి వచ్చింది. కానీ మొదటి సారి OTT లో రిలీజ్ అయినా సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు ఇలా ఏ సినిమాకు జరగలేదు.
Swetha
ఈ మధ్య కాలంలో OTT లో వచ్చిన ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫిలిం అనగనగ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సుమంత్ నుంచి ఇలాంటి ఓ ఎమోషనల్ డ్రామా వచ్చి చాలా కాలమే అయిందని చెప్పి తీరాలి. దీనితో ఈ సినిమాకు మంచి మార్కులు పడుతున్నాయి. తక్కువ సినిమాలు చేసిన కానీ వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తాడు సుమంత్. ఇప్పటివరకు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు OTT లో రిలీజ్ అవ్వడమే.. కానీ OTT రిలీజ్ అయిన సినిమాలు థియేటర్స్ లో అడుగుపెట్టింది లేదు. కానీ మొదటి సారి డైరెక్ట్ గా OTT లో రిలీజ్ అయినా సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది.
ఈటీవీ విన్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. సో ఆల్రెడీ ఈటీవీ విన్ వారు వైజాగ్, విజయవాడలో లిమిటెడ్ గా ఫ్రీ షోస్ థియేటర్స్ లో వేశారు. దానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీనితో మూవీ టీం ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ వారం నుంచి మరిన్ని థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట. కొన్ని సినిమాలను చూస్తే ఇది థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిన కదా అని చాలా మంది ఆడియన్స్ కు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మాటల వరకే ఆగిపోతుంది. కానీ అనగనగ మాత్రం నిజంగానే థియేటర్స్ వరకు చేరింది. ఇంకా ఈ సినిమా ఎలాంటి మెప్పు సంపాదిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.