Sudigali Sudheer: సడెన్ గా OTTలోకి వచ్చిన సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం సుధీర్ ప్రస్తుతం హీరోగా మారి వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తను నటించిన ఓ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం సుధీర్ ప్రస్తుతం హీరోగా మారి వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తను నటించిన ఓ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..

సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. ‘జబర్దస్త్’లోకి వెళ్లిన తర్వాత టీమ్ లీడర్ గా స్కిట్స్, యాంకర్‌గా ఈవెంట్స్ హోస్ట్ చేశాడు. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యి.. సినిమాల మీదనే తన దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల ముందు ‘గాలోడు’ అనే మాస్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. తాజాగా ‘కాలింగ్ సహస్ర’ మూవీతో వచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా సుధీర్ నటించిన ఓ కొత్త సినిమా.. సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇంతకు ఆ సినిమా ఏది.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

ఈ ఏడాది చివర్లో.. సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పకలరించాడు. టెక్నికల్ అంశాలతో తీసిన ఈ సినిమా.. రెగ్యులర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దాంతో ఫ్లాప్‌గా నిలిచింది. డిసెంబరు 1న థియేటర్లలో విడుదైలన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు సినిమానే కాబట్టి.. కొత్త ఏడాది రోజున.. కొత్త సినిమా చూస్తూ.. టైమ్ పాస్ చేసేయండి.

కాలింగ్ సహస్ర కథేంటంటే..

అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఈ క్రమంలో అతడికి బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో సిటీకి వస్తాడు. హైదరాబాద్ కి రాగానే..ఓ కొత్త సిమ్ తీసుకుంటాడు. ఆరోజు నుంచి అతడికి అనుకోని కాల్స్ వస్తూనే ఉంటాయి. అతని ఫోన్ నుంచి అతనికే మెసేజ్‌లు రావడం మొదలవుతాయి. ఆ మెసేజెస్ ఏంటి.. ఎక్కడ్నుంచి వస్తున్నాయి.. దాని కథేంటో తెలుసుకోవాలని వెళ్లి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు అజయ్ శ్రీవాస్తవం.

తన ఫోన్ నుంచి తనకే మెసేజ్‌లు ఎలా వస్తున్నాయి.. అజయ్‌తో పాటు అతని తమ్ముడు సత్య (రవితేజ నన్నిమాల), అదే ఇంట్లో పేయింగ్ గెస్ట్ అయిన స్వాతి (డాలీ షా) ఈ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నారు.. ఆ తర్వాత వాళ్లు ఎలా బయటపడ్డారనేది కథ. కాకపోతే ఇది ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. కానీ టెక్నికల్ అంశాలపై ఆసక్తి ఉన్న వారు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Show comments