సినిమా హాల్లో కలకలం.. మాస్కులతో వచ్చిన దుండగులు..

అందరూ ఎంతో ఆసక్తిగా సినిమా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మాస్కులతో థియేటర్లలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న...

అందరూ ఎంతో ఆసక్తిగా సినిమా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మాస్కులతో థియేటర్లలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న...

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో భారతీయులు జీవిస్తున్నారు. కొన్ని దేశాల్లో స్థానికులతో పోటీగా భారతీయుల జనాభా ఉంటోంది. భారతీయులు ఎక్కువగా ఉన్న చోట్ల భారతీయ పద్దతులు ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భారతీయలే తోటి భారతీయుల కోసం హోటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్ల వంటివి ఓపెన్‌ చేసి నడిపిస్తూ ఉంటారు. ఏ దేశంలో ఉన్నా.. భారతీయులు మాత్రం సినిమా పిచ్చోళ్లే.. వీలు చిక్కినప్పుడల్లా సినిమాలకు వెళుతూ ఉంటారు.

అందుకే.. భారతీయ భాషలకు చెందిన సినిమాలు ఇతర దేశాల్లో కూడా విడుదలవుతూ ఉంటాయి. తాజాగా కెనడాలోని కొన్ని సినిమా హాళ్లలో కొందరు దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. హిందీ సినిమాలు ఆడే థియేటర్లలో విష వాయువులు వదిలారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  కెనడాలోని గ్రేటర్ టొరంటో ప్రాంతం. ఈ ప్రాంతంలోని మూడు వేరు వేరు సినిమా థియేటర్ లలో హిందీ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. టొరంటో ప్రాంతంలోని యార్క్ లో వాఘన్ సినిమా కాంప్లెక్స్ ఉంది.

ఇటీవల ఇక్కడ ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 9:20 నిమిషాల సమయంలో ప్రేక్షకులు వాఘన్ సినిమా కాంప్లెక్స్‌లోని థియేటర్‌లో కూర్చుని ఎంతో ఆసక్తిగా సినిమా చూస్తూ ఉన్నారు. అప్పుడు థియేటర్ లో దాదాపు 200 మంది ప్రేక్షకులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత కొంతమంది దుండగులు మాస్కులతో థియేటర్‌లోకి ప్రవేశించారు. తమ వెంట తెచ్చుకున్న స్ప్రేయర్లతో విష వాయువులను స్ప్రే చేశారు. దీంతో ఒక్క సారిగా థియేటర్‌లో కలకలం చెలరేగింది.

స్ప్రే కారణంగా ఆ ప్రదేశంలో ఉన్నవారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొందరికి శ్వాస తీసుకోవడం కూడా అత్యంత కష్టంగా మారింది. థియేటర్‌ యాజమాన్యం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు వచ్చే సమయానికి దుండగులు అక్కడినుంచి తప్పించుకున్నారు. పోలీసులు బాధితులకు ప్రధమ చికిత్స అందించారు. ఈ వారంలోనే ఇటువంటి సంఘటనలు ఇంకొన్ని జరిగాయని అక్కడి మీడియా తెలిపింది.

ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాలలోనుంచి విచారణ చేపడుతున్నారు. అయితే.. గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్లిన భారతీయుల మరణాల సంఖ్య పెరుగుతోందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో కేవలం కెనడాలో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉందని వారు చెప్పారు. అందులో సహజ మరణాలు కొన్ని, అనుమాస్పద మరణాలు మరికొన్ని. ఏదేమైనా అక్కడి ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మరి, కెనడాలో సినిమా హాల్లో జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments