సంక్రాంతికి శివకార్తికేయన్ ‘అయలాన్’ లేనట్టే..!

టాలీవుడ్ కోడి పుంజులకే థియేటర్లు దొరకడం లేదంటే.. మధ్యలో మేమున్నామంటూ వచ్చేందుకు సిద్ధమౌతున్నారు తమిళ తంబీలు. అందులో ఒకటి శివకార్తీకేయన్ మూవీ అయలాన్. దీని నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. అయితే..

టాలీవుడ్ కోడి పుంజులకే థియేటర్లు దొరకడం లేదంటే.. మధ్యలో మేమున్నామంటూ వచ్చేందుకు సిద్ధమౌతున్నారు తమిళ తంబీలు. అందులో ఒకటి శివకార్తీకేయన్ మూవీ అయలాన్. దీని నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. అయితే..

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుండి నాలుగు కోడి పుంజులు బాక్సాఫీసు బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, యంగ్ టాలెంట్ తేజ సజ్జా హనుమాన్ జనవరి 12న విడుదల అవుతుంటే.. టాలీవుడ్ సీనియర్లు వెంకీ మామ, మన్మధుడు నాగార్జున జనవరి 13,14 తేదీలు తమవని ఖర్చీఫ్ వేసుకున్నారు. అయితే రవితేజ కూడా ఈగల్ అంటూ రావాల్సి ఉండగా.. సినీ పెద్దలు చర్చలు జరపడటంతో.. ఓ ఒప్పందంపై కాస్తంత వెనక్కు తగ్గాడు మాస్ మహారాజ్. ఇవి చాలవన్నట్లు తమిళ సినిమాలు కూడా సందేట్లో సడేమియాలా సిద్ధమయ్యాయి. తెలుగు డబ్బింగ్ వర్షన్లతో ఈ సంక్రాంతికే వస్తామని చెప్పేశాయి. వాటిల్లో ధనుష్ కెప్టెన్ మిల్లర్, అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1, శివ కార్తీకేయన్ అయలాన్ మూవీస్ ఈ జాబితాలో ఉన్నాయి.

వీటిల్లో మోస్ట్ ఎక్సైటెడ్ మూవీగా నిలుస్తోంది శివ కార్తీకేయన్ మూవీ అయలాన్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ లో జనవరి 12న విడుదల చేస్తుండగా.. అదే రోజు తెలుగులో కూడా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతలో అదే రోజు మహేష్, తేజ మూవీస్ హనుమాన్ విడుదల అవుతున్నాయి. థియేటర్ల విషయంలో ఇప్పటికే ఈ రెండు చిత్రాల మధ్య క్లాషెస్ వస్తున్నాయి. గుంటూరు కారం కోసం ఇప్పటికే నైజాం పంపిణీ హక్కులు కలిగి ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. మహేష్ సినిమాకు 90 శాతం ధియేటర్లు కొనుగోలు చేశాడు. అంతలో అయలాన్ మూవీ నైజాం రైట్స్ తీసుకున్నాడు. ఈ నిర్ణయం అగ్నిలో మరింత ఆజ్యం పోసుకున్నట్లు అయ్యింది అతనికి.

హనుమాన్‌కు థియేటర్లు దక్కకుండా చేశాడన్న కోపం తీవ్ర స్థాయిలో ఉంది నెటిజన్లకు దిల్ రాజుపై. మూడు సినిమాలకు థియేటర్లు ఎలా కేటాయింపులు జరుగుతాయన్న తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పుడు అయలాన్ తెలుగు వర్షన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ రేసు నుండి తప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇది మహేష్, తేజ అభిమానులకు ఊరట కలిగించినా, శివ కార్తీకేయన్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఎందుకంటే.. తెలుగులో శివ కార్తికేయన్ రెండు సినిమాలు చేసి కొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ కూడా బాక్సాఫీసు బరి నుండి తప్పుకోవడంతో ఇప్పుడు మహేష్, తేజ సినిమాల మధ్యే పోటీ నెలకొంది. మరీ ఈ రెండు చిత్రాల్లో ఏదీ బాక్సాఫీసును మెప్పిస్తున్నాయని అనుకుంటున్నారో.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments