పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 12:18 PM, Sat - 26 August 23
  • Author Soma Sekhar Published - 12:18 PM, Sat - 26 August 23
పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ! పోస్ట్ వైరల్..

తెలంగాణలో ఎన్నికల హడావిడి మెుదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక మిగతా పార్టీలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వార్త గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఆ న్యూస్ ఏంటంటే? టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతాడన్న ప్రచారం జోరందుకుంది. దానికి కారణం గతంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలుకోవడమే. అయితే నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో.. రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ ను సత్కరించి రూ. 10 లక్షలు కూడా బహుమతిగా ఇచ్చారు. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ సింగర్.

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ విన్నర్ గా, సింగర్ గా, యాక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆస్కార్ విన్నింగ్ నాటునాటు పాట పాడి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు రాహుల్. కాగా.. అతడు పాడిన పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో.. అతడి పేరు మారుమ్రోగిపోయింది. దీంతో అతడిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఇది జరిగిన దగ్గర నుంచి రాహుల్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు షికారు చేశాయి. అదీకాక కాంగ్రెస్ పార్టీ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తాడు అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

దీంతో ఈ వార్తలపై తాజాగా స్పందించాడు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. తన ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసి ఈ వార్తకు చెక్ పెట్టాడు.”గత కొన్ని రోజులుగా గోషామహల్ నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు. పైగా నాకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. నేను ఆర్టిస్టును, అందరినీ ఎంటర్ టైన్ చేయడమే నాపని. నేను మ్యూజిక్, ఇండస్ట్రీకే కట్టుబడి ఉంటా. అన్ని పార్టీల్లోని నేతలను నేను గౌరవిస్తా” అంటూ ఈ పోస్ట్ లో రాహుల్ రాసుకొచ్చాడు. దాంతో ఇన్ని రోజుల నుంచి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం రాహుల్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇదికూడా చదవండి: నేషనల్ అవార్డు విన్నర్.. బన్నీకి చెర్రీ దంపతుల స్పెషల్ గిఫ్ట్!

Show comments