షాకిస్తున్న యానిమల్ వేట.. కరెక్ట్ అవుతున్న దిల్ రాజు జోస్యం

Animal Worldwide Collections Till Now: థియేటర్లను షేక్ చేసేస్తుంది యానిమల్ మూవీ. రణబీర్ కపూర్ యాక్టింగ్ అరుపులు, కేకలు పుట్టిస్తుంది. సినిమాకు తగ్గట్టే థియేటర్లలో కాసుల వర్షం కురుస్తుంది. ఇక్కడే కాదూ.. యుఎస్ లో కూడా ఈ మూవీ డాలర్లను కుమ్మరిస్తోంది.

Animal Worldwide Collections Till Now: థియేటర్లను షేక్ చేసేస్తుంది యానిమల్ మూవీ. రణబీర్ కపూర్ యాక్టింగ్ అరుపులు, కేకలు పుట్టిస్తుంది. సినిమాకు తగ్గట్టే థియేటర్లలో కాసుల వర్షం కురుస్తుంది. ఇక్కడే కాదూ.. యుఎస్ లో కూడా ఈ మూవీ డాలర్లను కుమ్మరిస్తోంది.

యానిమల్ సినిమా రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. విడుదలవుతూనే సునామీ రేపింది. వయొలెన్స్ ఎక్కువనీ, న్యూడిటీ ఉందని, ఫ్యామిలీలు చూడ్డం కష్టమని ఇలా ఎలా పడితే వ్యాఖ్యానాలు జరిగాయి. కానీ ఏవీ యానిమల్ వేటకి అడ్డుకాలేకపోయాయి. ఇటీవలి రోజులలో యానిమల్ లాంటి సక్సెస్ ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీ కూడా చూడలేదంటే అతిశయోక్తి కానేకాదు. ఒక్క హైదరాబాద్ తీసుకున్నా కూడా తెలుగు వెర్షన్ మాత్రమే కాదు, హిందీ వెర్షన్ కూడా కలెక్షన్ల్ వరదలా ఉంది. మొన్న మీడియాతో  దిల్ రాజు చెప్పినట్టు.. పదిరోజులలో ఒక్క తెలుగు వెర్షన్ తీసుకుంటేనే దాదాపుగా 50 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తుంది యానిమల్. దిల్ రాజు యానిమల్ గ్రాస్ కలెక్షన్ల పట్ల పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నారు.

 ఎంత ఇన్ స్ఫైర్ అయ్యారంటే దిల్ రాజు మీడియాకి సమాధానం చెబుతూ స్క్రిప్టు దొరికితే ఆడియన్స్ కి చెప్పి మరీ తీస్తానని తెలియజేశారు.  ఇండియాలో పక్కనబెడితే, యుఎస్ లో కూడా యానిమల్ కి ఎదురులేనట్టుగా ఉంది. నార్త్ అమెరికాలో గ్రాస్ కలెక్షన్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 8.6 మిలియన్ డాలర్లు ఇప్పటికి కలెక్ట్ చేసింది యానిమల్ అని రిపోర్టులు చెబుతున్నాయి. టోటల్ గా యూత్ ఒక్కటే అయితే ఇంత భారీ వసూళ్ళు కష్టం. ఫ్యామిలీలు కూడా చూస్తేనే ఏ సినిమాకైనా ఇంత స్పేన్ దొరుకుతుంది. రిలీజైన ఆరు రోజులలో వరల్డ్ వైడ్ యానిమల్ కలెక్షన్లు స్టన్నింగ్ ఉన్నాయి. టోటల్ గా ఇండియన్ ఇండస్ట్రీకే షాక్. రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో వరల్డ్ వైడ్ లేటెస్ట్ రిపోర్టు 527.6 కోట్లు వసూళ్ళు రాబట్టింది యానిమల్.

ఇప్పట్లో యానిమల్ వేట ఆగేట్టు లేనేలేదు. ప్రస్తుతం ప్రపంచం యావత్తు అటెన్షన్ యానిమల్ చిత్రం పైనే ఉంది. రామ్ గోపాల్ వర్మ తర్వాత బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి ఇండియా మొత్తంలోనే కాదు, ప్రపంచ వేదిక మీద తెలుగువారి జెండా ఎగురవేస్తే, తాజాగా సందీప్ రెడ్డి వంగా తన షేర్ తను తీసుకున్నాడు. అయితే రాజమౌళి అయినా తెలుగువాళ్ళతోనే సినిమాలు తీసి ప్రపంచ ప్రఖ్యాతమైతే, రామ్ గోపాల్ వర్మ తర్వాత హిందీ నటీనటులతోనే తీసి, బాలీవుడ్ గుండెల్లో దడ పుట్టించిన దర్శకుడు ఎవరంటే ధైర్యంగా సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పడానికి వెనుకాడనక్కర్లేదు. రణబీర్ కపూర్ జీవితంలోనే ఇటువంటి సినిమా చేస్తానని గానీ, ఇటువంటి హిట్ వస్తుందని గానీ ఊహించలేదు. ఈ మాట రణబీర్ కపూరే చెబుతున్నాడు. అందరూ మరచిపోయిన బాబీడియోల్ కెరీర్లో ఇదో పెద్ద సంచలనాత్మకమైన మలుపు.

Show comments