Jr.NTR ఫ్యాన్స్‌కు షాక్! ఇక ఆ ట్రెండ్ కి దూరంగా ఉంటే బెటర్

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించలేదు. దేవరతో వచ్చే ఏడాది పలకరించబోతున్నాడు. ఆయన్ను తెరపై చూసేందుకు ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో రీ రిలీజ్ రూపంలో విడుదలైంది..

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించలేదు. దేవరతో వచ్చే ఏడాది పలకరించబోతున్నాడు. ఆయన్ను తెరపై చూసేందుకు ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో రీ రిలీజ్ రూపంలో విడుదలైంది..

అందమైన రూపం, ఏక సంతాగ్రహి, డ్యాన్సులు, తన డైలాగులతో పాటు అంతకు మించిన యాక్టింగ్‌తో వెండితెరపై అలరిస్తున్న నట విశ్వరూపం జూనియర్ ఎన్టీఆర్. నట సౌర్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని, ముఖ వర్చస్సును పుణికి పుచ్చుకుని పరిశ్రమలోకి అడుగు పెట్టి.. యంగ్ టైగర్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో విశ్వ నటుడిగా మారిన తారక్.. ఇప్పుడు దేవరతో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒకప్పటి అందాల తార.. దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ అవుతుంది. ఈ కాంబో కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సంగతి విదితమే. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, టామ్ చాకో తదితరులు నటిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్ట్స్ సమ్మర్ లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైతుంది. అనుకున్నట్లే జరిగితే.. వారు చెప్పిన ఏప్రిల్ 5, 2024న రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి యంగ్ టైగర్‌ను ఫ్యాన్స్ తెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇంతలో అభిమానులను ఖుషీ చేస్తూ.. సరికొత్త ట్రెండ్ రీ రిలీజ్ రూపంలో అదుర్స్ వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2010లో క్లాస్/ మాస్ హిట్. జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఇందులో చారీ పాత్రలో ఆయన చేసిన నటన సూపర్బ్. ఇప్పటికీ భట్టు అలియాస్ బ్రహ్మనందం, చారీ (యంగ్ టైగర్) మధ్య జరిగే సీన్లని ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టదు. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి.

అటువంటి మూవీ ఇప్పుడు రీ రిలీజ్ చేశారు ఈ సినిమా మళ్లీ రిలీజ్ చేస్తారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ నెల 18న ఎటువంటి హడావుడి, ప్రమోషన్స్ లేకుండానే నేరుగా థియేటర్లలో విడుదలైంది. అయితే మినిమం కలెక్షన్లు కూడా వసూలు చేయలేదని సమాచారం. దీంతో షాక్ కు గురౌతున్నారు ఫ్యాన్స్. ఏదో అనుకుంటే మరేదో అయ్యింది. ఏదైనా కొత్తగా చేస్తే.. ఎగబడతారు జనం. కానీ మళ్లీ మళ్లీ అదే చేస్తే బోరు కొట్టేస్తుంది. అదుర్స్ మూవీ విషయంలో అదే జరిగింది. రీ రిలీజ్ తొలి నాళ్లలో తమ హీరో మూవీస్ థియేటర్లలో వస్తుంటే ఎగబడ్డ ప్రేక్షకుల నుండి ఇప్పుడు ఆదరణ కొరవడింది. పాత చింతకాయ పచ్చడిని ఫస్ట్ టైం తింటే రుచిగానే ఉంటుంది. ఆ తర్వాత మొహం మొత్తేస్తుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది రీ రిలీజ్ విషయంలో. ఇప్పుడైనా ఇటువంటి ట్రెండ్ కు దూరంగా ఉంటే బెటరని సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు.

Show comments