చంద్రకాంత్‌ ఆత్మహత్యకు అసలు కారణం అదేనా.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా?

Actor chandrakanth: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి.

Actor chandrakanth: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి.

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఆ మద్య బుల్లితెర నటుడు చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ నటించిన పవిత్రనాథ్ కన్నుమూశాడు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే.. ఆమె సహ నటుడు, భర్తగా ప్రచారం జరుగుతున్న చంద్రకాంత్ శుక్రవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో తన నివాసంలో బలవన్మరణానికి పాల్పపడ్డారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. అయితే చంద్రకాంత్ ఆత్మహత్యకు గల కారణాల గురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

బుల్లితెర ఎంతో పాపులారిటీ సంపాదించిన త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం 2 వంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చందు అలియాస్ చంద్రకాంత్ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లోని తన నివాసంలో శుక్రవారం (మే17) న ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆరేళ్లుగా చంద్రకాంత్ టివి నటి పవిత్ర జయరామ్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇంతలోనే పవిత్ర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె తన స్నేహితులతో బెంగుళూర్ నుంచి హైదరాబాద్ కి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే కన్నుముసింది. అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి చంద్రకాంత్ డిప్రేషన్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

యాక్సిడెంట్ తర్వాత చంద్రకాంత్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో తనకు తగిలిన గాయాలు పవిత్ర చూసి తట్టుకోలేకపోయిందని.. దాంతో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చిందని సోషల్ మాధ్యమాల్లో వెల్లడించాడు. పవిత్ర తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని చంద్రకాంత్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న పవిత్ర  తన వల్లనే  చనిపోయిందని పలుమార్లు గుర్తు చేసుకొని కుమిలిపోయాడు. పవిత తనను పిలుస్తుంది.. రెండు రోజుల్లో వచ్చేస్తా అంటూ ఎమోషనల్ గా పోస్టులు పెట్టాడు. ఏది ఏమైనా ఐదు రోజుల వ్యవధిలో ఇండస్ట్రీలో ఇద్దరి మరణాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Show comments