పవిత్ర నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది.. కుటుంబానికి దూరం చేసింది: చంద్రకాంత్‌ తల్లి

తన కొడుకు మరణంతో చందు తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరు అవుతోంది. తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తన కొడుకు మరణంతో చందు తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరు అవుతోంది. తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

త్రినయని సీరియల్ ఫేమ్ జోడీ పవిత్ర జయరామ్-చంద్రకాంత్ ల మరణాలు ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేశాయి. గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒక్కటి కావాలనుకుంది. కానీ విధి వారి తలరాతను వేరే విధంగా రాసింది. కారు ప్రమాదలో పవిత్ర మరణించగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్.. శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తన కొడుకు మరణంతో చందు తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరు అవుతోంది. తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

పవిత్ర జయరామ్ మరణాన్ని తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నటుడు చంద్రకాంత్. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. తన కొడుకు మరణించడానికి కారణం పవిత్ర అంటూ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది చందు తల్లి. ఓ యూట్యూబ్ ఛానల్ తో చంద్రకాంత్ తల్లి మాట్లాడుతూ..”నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది పవిత్ర. 5 సంవత్సరాల నుంచి నా కొడలిని కలుసుకోకుండా చేసింది. మాట్లాడలేదు, ఇంటికి రానిచ్చేది కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, నాతో ఉంటాడని పవిత్ర చెప్పింది. కారు యాక్సిడెంట్ అయ్యిందని, పవిత్ర చనిపోయిందని ఆ రోజు ఫొన్ లో మాతో చెప్పాడు. చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు.  ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు” అంటూ రోదిస్తూ చెప్పింది చందు తల్లి.

“చనిపోయే ముందు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగాడు. ఆ రోజు ఫ్రెండ్ రూమ్ లోనే పడుకున్నాడు. మళ్లీ మమ్మల్ని చూస్తే ఎక్కడికిపోతాడో అని భయపడి అక్కడే పడుకోనిచ్చాం. కానీ అక్కడ తన చేయిని కొట్టుకోవడంతో రక్తం కారిందని ఫ్రెండ్స్ చెప్పారు. అయితే చనిపోతాడని మాత్రం మేము ఊహించలేదు. చనిపోయే ముందు వాడికి తల్లి, పిల్లలు కనిపించలేదా? వాడికి మేమందరం ఉన్నాం కదా? ఎందుకు ఇలా చేశావురా? మా కుటుంబాన్ని నాశనం చేసింది పవిత్ర. నా కొడుకును నాకు దూరం చేసింది. వాడు నన్ను ముట్టుకోనిచ్చేవాడు కూడా కాదు” అంటూ ఈ ఐదేళ్లలో తాను అనుభవించిన బాధను కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చింది. చందు తల్లి మాటలు వింటుంటే.. చూసేవారికి సైతం కన్నీళ్లు వస్తాయి. చెట్టంత కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.

Show comments