ప్రణిత్ హన్మంతు కేసులో కొత్త ట్విస్ట్! సార్ కి గంజాయి అలవాటు కూడా!

Praneeth Hanumanthu: తమ వీడియోలు, రీల్స్ కి లైక్స్, షేర్స్ రావాలని కొంతమంది చేస్తున్న పిచ్చిపనుల వల్ల సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రీ కూతురు అనుబంధంపై పిచ్చి కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేశారు.

Praneeth Hanumanthu: తమ వీడియోలు, రీల్స్ కి లైక్స్, షేర్స్ రావాలని కొంతమంది చేస్తున్న పిచ్చిపనుల వల్ల సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రీ కూతురు అనుబంధంపై పిచ్చి కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేశారు.

దేశంలో సోషల్ మీడియాలో వల్ల ఉన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అదే రేంజ్ లో నష్టాలు కూడా ఉన్నాయి. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు. కొంతమందితక్కువ సమయంలో సోషల్ మీడియాలో పాపులర్ కావాలని చేయరాని తప్పులు చేయడంతో ట్రోల్స్ కి గురికావడం జరుగుతుంది.ఇటీవల సోషల్ మీడియాలో తండ్రీ కూతురుకు సంబంధించిన ఓ వీడియో వచ్చింది. దానిపై యూట్యూబర్, నటుడు ప్రనీత్ హనుమంతు మరో యూట్యూబర్స్‌తో కలిసి ఆ వీడియోపై అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. అది కాస్త వైరల్ కావడంతో సినీ సెలబ్రెటీలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. తాజాగా ప్రణీత్ హన్మంతు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో హీరో సుధీర్ బాబు నటించిన ‘హరోం హర’ మూవీలో సెల్వ మణికాయం బుజ్జులు పాత్రలో నటించిన యూట్యుబర్, కంటెంట్ క్రియేట్ర్ ప్రణీత్ హన్మంతు ఓ తండ్రీ కూతురుకి సంబంధించిన వీడియోపై అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సెలబ్రెటీలు, నెటిజన్లు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రణీత్ హన్మంతు తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ప్రణీత్ హన్మంతు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ సమయంలో ప్రణీత్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తండ్రీ కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో నీచమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంతుకు మరింత చిక్కుల్లో పడనున్నారు. అరెస్ట్ సమయంలో అతని నుంచి సేకరించిన శాంపిల్స్ లో గంజాయి సేకరించినట్లు ఆనవాళ్ళు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ఫోరెన్సీక్ నివేదిక సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు అందింది. ఇప్పటికే అతడిపై ఐటీ, ఫోక్సో యాక్ట్ తో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 79,294 కింద కేసులు నమోదు అయి దర్యాప్తు జరుగుతుంది. ఆ నివేదికల ఆధారంగా నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ – 1985 కింద ఈ కేసులో పలు సెక్షన్లు జోడించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది.

Show comments