P Venkatesh
టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆడవాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది. ఈ వ్యవహారం నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆడవాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది. ఈ వ్యవహారం నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది.
P Venkatesh
ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి దాదాపు తెలియని వారుండరేమో. సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో బామ్మ క్యారెక్టర్ లో అలరిస్తున్నది. అన్నపూర్ణమ్మ అంటే ఇండస్ట్రీలో నాటి తరం నుంచి నేటి తరం నటీనటులకు ఎనలేని గౌరవం. ఇంతటి పాపులారిటీ పొందిన నటి అన్నపూర్ణ ఆడవాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె మహిళలను అగౌరపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై సింగర్ చిన్మయితో పాటు స్టార్స్ సైతం ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అన్నపూర్ణమ్మ ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు ఏంటీ? ఆడవాళ్లను కించపరిచేలా అలా ఎందుకు మాట్లాడింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నటి అన్నపూర్ణమ్మ ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఆడవాళ్లపై జరిగే ఆఘాయిత్యాలు, ఆ దారుణాలకు మహిళలు కూడా కారణమే అన్నట్లు చెప్పుకొచ్చింది. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడవారికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు ఏం పని? ఎప్పుడు ఎదుటి వాళ్లదే తప్పు అనకూడదు. మనది కూడా కొంచెం ఉంటుందంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది. సీనియర్ నటి అయ్యుండి ఆడవారిని అగౌర పరుస్తూ మాట్లాడటం కలిచివేసిందని చిన్మయి తెలిపింది. తాను ఎంతగానో గౌరవించే అన్నపూర్ణమ్మ ఇలా మాట్లాడటంతో నా హృదయం ముక్కలైనట్లు అనిపిస్తోందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. అన్నపూర్ణమ్మ మాటలను బట్టి ఆడపిల్లలు అర్థరాత్రి పుట్టకూడదు. ఆడపిల్లలుగా పుట్టడమే మన ఖర్మ అంటూ వాపోయింది. ఆమె చెప్పినట్లుగా చేస్తే అర్థరాత్రి ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్లు ఉండరని వాళ్లు అర్థరాత్రి ఇంట్లోనే ఉంటారని వెల్లడించింది. అంతేగాక ఏవైనా రోడ్డు ప్రమాదాలు, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రాత్రుళ్లు కాకుండా పగటి వేళలోనే జరగాలని అర్థరాత్రి జరిగితే ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచాలని ఎద్దేవా చేసింది. మహిళల వేషధారణ వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే ఇలాంటి వారు ఉన్న సమాజంలో ఆడవాళ్లుగా పుట్టడం దురదృష్టకరమని సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది.